Guide Dogs: ఆమెకు కళ్లు లేవు.. అవసరం కూడా లేదు.. ఎందుకంటే ఆమెతో ఆ కుక్క ఉంది

|

Jan 09, 2023 | 7:10 PM

తర్ఫీదు పొందని కొత్త కుక్కలను సాయం కోసం తీసుకుంటే.. అవి ఇతర కుక్కలతో కలపడానికి చాలా సమయం పడుతుందని అంధులకు తెలుసు. శిక్షణ పొందని కుక్క లేకుండా ఆ మహిళ చాలా కష్టపడింది. అంతేకాదు ఆమె దారిలో చాలాసార్లు పడిపోయింది. దీంతో తానే తన సొంత కుక్కకు శిక్షణ ఇవ్వాలని భావించింది. ఆ మహిళ.

Guide Dogs: ఆమెకు కళ్లు లేవు.. అవసరం కూడా లేదు.. ఎందుకంటే ఆమెతో ఆ కుక్క ఉంది
Training Guide Dogs
Follow us on

అంధులు ఎక్కడకి వెళ్లాలన్నా ఏ పనులు చేసుకోవాలన్నా దానికి తగిన గైడెన్స్ ఉండాలి. అయితే తమకు సహాయంగా కొందరు తర్ఫీదు పొందిన కుక్కల సాయం తీసుకుంటారు.  బిబిసి నివేదిక ప్రకారం.. గైడ్ డాగ్‌ల కొరత ఏర్పడింది. దీంతో అంధులు స్వయంగా కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల ఇసాబెల్ హోల్డ్‌స్‌వర్త్ అనే మహిళ అంధత్వం కారణంగా.. తాను చాలా విభిన్న గైడ్ డాగ్‌ల సహాయం తీసుకున్నానని చెప్పారు.  తాజాగా తనకు సాయం నిలిచే కుక్క ఒకటి చనిపోయింది. దీంతో మర్నాడు ఆ మహిళ కుక్క లేకుండా పనికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.

తర్ఫీదు పొందని కొత్త కుక్కలను సాయం కోసం తీసుకుంటే.. అవి ఇతర కుక్కలతో కలపడానికి చాలా సమయం పడుతుందని అంధులకు తెలుసు. శిక్షణ పొందని కుక్క లేకుండా ఆ మహిళ చాలా కష్టపడింది. అంతేకాదు ఆమె దారిలో చాలాసార్లు పడిపోయింది. దీంతో తానే తన సొంత కుక్కకు శిక్షణ ఇవ్వాలని భావించింది. ఆ మహిళ.

అయితే ఈ పని చేయడం సులభం కాదు. చాలా మంది ఏళ్ల తరబడి ఈ పని చేయాల్సి ఉంటుంది. శిక్షణ పొందిన కుక్కలు అంధులను రెస్టారెంట్లు, దుకాణాలు, టాక్సీలు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లగలదా అనే పెద్ద ప్రశ్న తలెత్తుతుంది? దీంతో ఇసాబెల్లె తన కుక్కకు శిక్షణ ఇవ్వడానికి పరిశోధన చేయడం ప్రారంభించింది. ఇందుకోసం చాలా మందితో కూడా మాట్లాడింది. తాను కుక్కకు శిక్షణ ఇవ్వగలను అనే నమ్మకం ఇసాబెల్లె వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కుక్కకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఇసాబెల్ ఒక కుక్కకు రెస్క్యూ సెంటర్‌లో ట్రైన్ ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం తర్ఫీదు కోసం లాబ్రడార్ కుక్క ను తీసుకుంది. దీని పేరు లూసీ. ఇసాబెల్ లూసీకి శిక్షణ ఇవ్వడానికి ఒక వారంలో ఒక రోజు సెలవు తీసుకుంది.

ఇవి కూడా చదవండి

కుక్కలకు శిక్షణ ఇవ్వడంలో ప్రధాన విషయం ఏమిటంటే రోడ్డు దాటడం. తమ యజమానిని కుక్కలు అత్యంత భద్రంగా రోడ్డు దాటించాలి. అందుకు తమ యజమాని సూచనలను పాటించకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు వారి సూచనలు ప్రమాదానికి కారణం కావొచ్చు. ఇసాబెల్ లూసీని రోడ్డు దాటుదామని అడిగితే ఆ కుక్క యజమాని అజ్ఞాను పాటించకూడదు. ఆంటీకాదు వాహనం సమీపిస్తుంటే.. కూడా ఆమె ఈ సూచనను పాటించకూడదు. ఈ విధంగా కుక్కలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

అంధ శిక్షకురాలు కావడంతో.. రోడ్డు లేఅవుట్, కార్లు ఎక్కడి నుండి వస్తున్నాయనే దాని గురించి ఇసాబెల్లె తెలుసుకోవాలి. తన కుక్కను పూర్తిగా నమ్మడానికి తనకు 4 నెలలు పట్టిందని చెప్పింది. ఇప్పుడు తన కుక్క తనకు చాలా ప్రయోజనకరంగా మారిందని తెలిపింది ఆమె. ఎలక్ట్రిక్ కారు వస్తున్న శబ్దం చాలాసార్లు ఇసాబెల్ వినలేదు. అటువంటి పరిస్థితిలో.. లూసీ ఇసాబెల్లెకి సహాయం చేస్తుంది.  ఇసాబెల్, లూసీ ఒకరితో ఒకరు అర్ధం చేసుకుని జీవించడం అలవాటు చేసుకున్నారు. ఇసాబెల్ లూసీకి శిక్షణ ఇవ్వడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..