Viral Video: గొంతులో చూయింగ్ గమ్ ఇరుక్కుని ఇబ్బందిపడ్డ బాలిక.. ఆ తర్వాత సీన్ ఇది

కేరళలోని కన్నూర్ జిల్లాలోని పల్లికరలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీధిలో నడుస్తుండగా, ఒక బాలిక నోట్లో చూయింగ్ గమ్ వేసుకుంది.. సైకిల్ మీద వెళ్ళడానికి సిద్దం అవుతుండగా.. చూయింగ్ గమ్ నోట్లో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడక ఇబ్బంది పడడం మొదలు పెట్టిన తర్వాత ఆ బాలిక చాలా తెలివిగా ఆలోచించింది. రోడ్డుమీద ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయాన్ని అర్ధించింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో చూడండి.

Viral Video: గొంతులో చూయింగ్ గమ్ ఇరుక్కుని ఇబ్బందిపడ్డ బాలిక.. ఆ తర్వాత సీన్ ఇది
Group Of Men Save Eight Year Old Girl

Updated on: Sep 20, 2025 | 2:41 PM

కేరళలోని కన్నూర్ జిల్లా పల్లికరలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన తన సైకిల్ పెట్టి.. బహుశా చూయింగ్ గమ్ కొనుక్కుని నోట్లో వేసుకుని మళ్ళీ నడుచుకుంటూ సైకిల్ దగ్గరకు వచ్చింది. అయితే ఆ బాలిక నోట్లో చూయింగ్ గమ్ చిక్కుకున్నట్లు ఉంది. దీంతో ఊపిరాడక ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయింది. భయపడిన ఆ అమ్మాయి రోడ్డుమీద తనకు సమీపంలో నిలబడి ఉన్న కొంతమంది యువకుల వద్దకు వెళ్ళింది. యువకులు బాలిక సమస్యని అర్ధం చేసుకుని… సమయం వృధా చేయకుండా వెంటనే సహాయం చేశారు. ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన మొత్తం CCTVలో రికార్డైంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై యూజర్లు స్పందిస్తున్నారు. ఈ యువకుల తెలివి తేటలను.. బాలికని కాపాడడానికి చూపించిన చొరవని ప్రశంసిస్తున్నారు. ఇలాంటివారే రియల్ హీరోలు అని పిలుస్తున్నారు.

ఈ వైరల్ వీడియోపై ఓ లుక్ వేయండి

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక నిమిషం నిడివి గల వీడియోలో ఒక రద్దీ వీధి కనిపిస్తుంది. దాదాపు 8 ఏళ్ల బాలిక తన సైకిల్ తొక్కడానికి సిద్ధమవుతోంది. సమీపంలో కొంతమంది యువకులు కబుర్లు చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆ అమ్మాయి గొంతులో అసౌకర్యంగా అనిపించినట్లు ఉంది. బాలిక నోట్లో వేసుకున్న చూయింగ్ గమ్ ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో భయపడింది. వెంటనే రోడ్డుమీద ఉన్న యువకుల దగ్గరకు వెళ్లి సైగ చేసి తన సమస్యని చెప్పింది. ఆ బాలిక నోట్లో చిక్కుకున్న బిగ్ బబూల్ కిందకు పడేలా చేశారు. యువకులు ఆ బాలికను ప్రమాదం నుంచి రక్షించారు. ఆ యువకులకు ప్రాధమిక చికిత్స పట్ల ఉన్న అవగాహన, సత్వర చర్య ఎనిమిదేళ్ళ బాలిక ప్రాణాలను కాపాడింది.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..