చుపాకబ్రా అనే పౌరాణిక జీవి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది రాక్షస వంటి జంతువు. ఇది జీవుల రక్తాన్ని పీల్చి చంపేస్తుంది. అయితే, ఈ అరుదైన భయంకర జీవి ఇప్పుడు బ్రెజిల్‌లో వేటగాళ్ల కంటపడిందని సమాచారం. భయంకరమైన దెయ్యం లాంటి, రక్తాన్ని పీల్చే జంతువును అక్కడి వేటగాళ్లు కాల్చి చంపినట్లు ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి, దాని ఉనికికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్‌లోని అనేక ప్రాంతాలలో జానపద కథలలో ఈ జీవికి ప్రముఖ పాత్రను కల్పిస్తారు. అలాంటి అరుదైన జీవిని వేటగాళ్లు చంపేశారనే వార్తలు, చనిపోయిన చుపాకాబ్రాలా జీవిగా చెబుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలను బట్టి ఆ జీవి మనిషిని పోలిన రూపంలో చేతులు, పదునైన దంతాలు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదిఒక పెద్ద సైజు కోతి పరిమాణంలో ఉంటుందని, అడవి పందులను వేటాడే క్రమంలోనే దీన్ని చూసినట్టుగా వేటగాళ్లు చెప్పారు. వింత జీవిని చూడగానే తామంతా దానిని వెంబడించామని కాల్చేసినట్టుగా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బ్రెజిల్‌లోని సావో పాలోకు పశ్చిమాన ఉన్న గుయా లోపెస్ డా లగునా అడవిలో చుపాకాబ్రాను కాల్చి చంపినట్లు వేటగాళ్ళు ఇప్పుడు పేర్కొన్నారు. ఈ జీవి మృత దేహాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, దాని చేతులు మానవులలా ఉన్నాయని చెప్పారు. ఈ చనిపోయిన జంతువు రక్తం తాగి అనేక పశువులను చంపిందని చెబుతారు. దీంతో చాలా కాలంగా రైతుల్లో భయానక వాతావరణం నెలకొంది.
కాగా, ఈ షాకింగ్ ఘటనను వివరిస్తూ ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే చనిపోయిన ఈ జీవి ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది అది కోతి కావచ్చునని అంటున్నారు. ఈ రకమైన కోతులు సాధారణంగా దక్షిణ, మధ్య అమెరికా అడవులలో కనిపిస్తాయి. నివేదికల ప్రకారం, చుపకాబ్రా మొదటిసారిగా 1995లో ప్యూర్టో రికోలో కనిపించింది. ఈ జీవి ఉత్తరాన మైనే వరకు, దక్షిణాన చిలీ, రష్యా, ఫిలిప్పీన్స్ వరకు కనిపించిందని చెబుతారు. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లక్ చేయండి..