wedding day: ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితాంతం చిరస్మరణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం దంపతులు కూడా కొత్త తరహా పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్‌లలో కొన్ని సక్సెస్ అవుతుండగా, మరికొన్ని అట్టర్‌ప్లాప్ అవుతూ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వధూవరులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ప్రతి ఒక్కరూ తమ పెళ్లిలో ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. తద్వారా ఆ క్షణం వారి జీవితంలో ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లయిన జంటకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి తరువాత మొదటి రాత్రి కోసం వరుడు నవ వధువును ఎత్తుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ, పాపం వరుడి ప్రయత్నం బెడిసికొట్టింది. అతని చేతుల్లోంచి వధువు జారిపడిపోయింది.
వైరల్ వీడియోలో వరుడు వధువును తన చేతుల్లోకి ఎత్తుకుని గదిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే తలుపు దగ్గర ప్రమాదం జరుగుతుంది. అకస్మాత్తుగా తలుపు దగ్గర వరుడి బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. ఈ వీడియో చూసిన యూజర్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వరుడు తన పెళ్లిపై ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాడని, అయితే ఆ ప్లాన్ పూర్తిగా సక్సెస్ కాలేదని వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా,లక్షల మంది వీక్షించారు. వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వరుడు అతిగా మద్యం సేవించినట్టున్నాడే..అంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్ చేశారు.