పెళ్లివేడుకలో ‘పబ్జీ’ గోల

| Edited By:

Apr 30, 2019 | 4:48 PM

ప్రపంచవ్యాప్తంగా పబ్జీ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లు దాటిన పిల్లల నుంచి 40ఏళ్ల వయసు గల వారి వరకు ఎంతోమంది ఈ ఆటకు బానిసలు అవుతున్నారు. అంతేకాదు ఈ మాయదారి గేమ్ వలన పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే పబ్జీకి అలవాటు అయిపోయిన ఓ వ్యక్తి.. వివాహ మండపంలో తన పక్కన ఉన్న వధువును కూడా పట్టించుకోకుండా ఆటలో నిమగ్నమైపోయాడు. అంతేకాదు అతిథులు వచ్చి కానుకలు ఇస్తూ విష్ చేస్తుంటే […]

పెళ్లివేడుకలో ‘పబ్జీ’ గోల
Follow us on

ప్రపంచవ్యాప్తంగా పబ్జీ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లు దాటిన పిల్లల నుంచి 40ఏళ్ల వయసు గల వారి వరకు ఎంతోమంది ఈ ఆటకు బానిసలు అవుతున్నారు. అంతేకాదు ఈ మాయదారి గేమ్ వలన పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే పబ్జీకి అలవాటు అయిపోయిన ఓ వ్యక్తి.. వివాహ మండపంలో తన పక్కన ఉన్న వధువును కూడా పట్టించుకోకుండా ఆటలో నిమగ్నమైపోయాడు. అంతేకాదు అతిథులు వచ్చి కానుకలు ఇస్తూ విష్ చేస్తుంటే వాటిని పక్కకు నెట్టేసి మరీ ఆటలో మునిగిపోయాడు. దాంతో పక్కనే ఉన్న పెళ్లికూతురు ఏం చేయాలో తెలియక అతడి ఫోన్‌లోకి తొంగిచూస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారగా.. అందరి చేత నవ్వులు పూయిస్తోంది. అయితే వరుడు నిజంగానే ఆ ఆటను ఆడుతుంటే వీడియో తీశారా..? లేకపోతే ఫ్రాంక్ వీడియోనా..? అన్నది తెలియరాలేదు.