IPL 2025: జరిగేది ఐపీఎల్ గురూ..! ఆటా మజాకా.. పెళ్లి ఆపేసి మరీ ఫైనల్ మ్యాచ్‌ చూశారు

బెంగళూరులో ఐపీఎల్ 2025 ఫైనల్‌ను చూడటానికి పెళ్లిని తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు, అతిథులు టీవీ ముందు RCB గెలుపు కోసం ఉత్కంఠగా చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. చివరి ఓవర్‌లో కోహ్లీ మోకాలిపై కూర్చున్న క్షణంలో "RCB, RCB", కోహ్లీ అంటూ వెడ్డింగ్ హాల్ మొత్తం మారుమోగింది.

IPL 2025: జరిగేది ఐపీఎల్ గురూ..! ఆటా మజాకా.. పెళ్లి ఆపేసి మరీ ఫైనల్ మ్యాచ్‌ చూశారు
Groom Paused Wedding

Updated on: Jun 04, 2025 | 2:51 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ IPL భారతదేశంలోనే కాదు.. ప్రపంచమంతటా అభిమానుల్ని ఉర్రూతలూగించేసింది. ఎక్కడ చూసినా ఇదే జోరు.. ఎక్కడ విన్న ఇదే హవా.. అందరికీ ఒక్కటే ఐపీఎల్‌ ఫీవర్‌..ఇక నిన్నటి ఫైనల్‌ మ్యాచ్‌ క్రేజ్‌ మాత్రం జనాల్లో మామూలుగా లేదు.. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఈ మ్యాచ్‌ని తిలకించారు. చివరకు 17ఏళ్ల కల సాకారమైందంటూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల‌ను పండగ చేసుకున్నారు. మరోవైపు ఈ విజ‌యంతో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానుల ఆనందాల‌కు అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన అభిమానుల సంబరాలు కూడా ఇప్పుడు నెట్టింట సందడిగా మారాయి.

దేశ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ముఖ్యంగా యువ‌త రోడ్ల‌పైకి వ‌చ్చి వ‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ను మించి పటాకులత మోతతో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ముఖ్యంగా బెంగ‌ళూరు, రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ హాడావుడికి ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్లుగా కనిపించింది. బెంగళూరులో ఓ పెళ్లి వేడుకలో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. పెళ్లి ఆపేసి మరీ IPL ఫైనల్ చూశారు పెళ్లివారంతా. ఇప్పుడా వీడియో వైరల్‌ అవుతోంది.

బెంగళూరులో ఐపీఎల్ 2025 ఫైనల్‌ను చూడటానికి పెళ్లిని తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు, అతిథులు టీవీ ముందు RCB గెలుపు కోసం ఉత్కంఠగా చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. చివరి ఓవర్‌లో కోహ్లీ మోకాలిపై కూర్చున్న క్షణంలో “RCB, RCB”, కోహ్లీ అంటూ వెడ్డింగ్ హాల్ మొత్తం మారుమోగింది. అనంతరం పెళ్లి తంతు పూర్తి చేశారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన వారంతా క్రికెటా మజాకా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us