Groom breaks down in tears: పెళ్లి వేడుక అనంతరం.. అప్పగింతల సమయంలో వధువు, ఆమె కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురై ఏడవటం సాధారణంగా మనందరం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగడం కామన్.. కానీ కానీ ఓ వరుడు మాత్రం తనకు కాబోయే భార్యను చూసి భావోద్వేగానికి గురై తెగ ఏడ్చేశాడు. అవును మీరు వింటున్నది నిజమే.. తాను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి దరి చేరుతున్న వేళ అతని మనసు పరవశించి.. కళ్లు చెమర్చాయి. గుండె నిండా ఆమెపై నింపుకొన్న ప్రేమ కన్నీటి రూపంలో ఉబికివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది అంటూ నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురయ్యేలా చేస్తోంది ఈ వీడియో.
పెళ్లి వేడుకలో వరుడు.. వధువు కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో వధువు కల్యాణ వేదిక వైపు నడుచుకుంటూ రావడం.. చూసి వరుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెపై గుండెలనిండా దాచుకున్న ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగటంతో అతడి కళ్లలో నీళ్లు చెమర్చాయి. ఆ కన్నీటిని తుడుచుకుంటూ వరుడు ఆమె వైపు చూశాడు. అంతే అతడిని చూసిన వధువు సైతం కన్నీరు పెట్టుకుంది. వేదికపైకి రాగానే.. తన కోసం ఎదురుచూస్తున్న వరుడిని కౌగిలించుకొని కన్నీరుని తుడిచింది.
వైరల్ వీడియో..
మనసు నిండా ఒకరిపై మరొకరు ప్రేమను నింపుకొన్న ఈ నూతన జంటను చూసిన నెటిజన్లంతా నిజమైన ప్రేమ వీరిదేనంటూ దీవిస్తున్నారు. చాలామంది పలు రకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ట్రెండింగ్ దుల్హనియా పేజీ.. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. దాదాపు లక్ష మంది వరకూ వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్‌గా మారింది.
Also Read: