Google Maps Fiasco: వామ్మో.. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే ఇదే గతి.. ఈ వ్యక్తి అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!

|

Aug 12, 2022 | 10:23 AM

గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరినైనా అడ్రస్ అడిగి.. ఎలా వెళ్లాల్లో కనుక్కుని వెళ్లేవాళ్లం.. కాని కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. ప్రస్తుత ఆధునిక యుగంలో ఎక్కడకి వెళ్లాలన్నా టెన్షన్ లేదు.. వెహికల్ స్టార్ట్ చేయడం.. గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం అంతే.. ఎక్కడకి వెళ్లాలో ఎంటర్ చేస్తే

Google Maps Fiasco: వామ్మో.. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే ఇదే గతి.. ఈ వ్యక్తి అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!
Google Map
Follow us on

Google Maps Fiasco: గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరినైనా అడ్రస్ అడిగి.. ఎలా వెళ్లాల్లో కనుక్కుని వెళ్లేవాళ్లం.. కాని కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. ప్రస్తుత ఆధునిక యుగంలో ఎక్కడకి వెళ్లాలన్నా టెన్షన్ లేదు.. వెహికల్ స్టార్ట్ చేయడం.. గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం అంతే.. ఎక్కడకి వెళ్లాలో ఎంటర్ చేస్తే అదే తీసుకెళ్తాదనే ధైర్యం. గూగుల్ మ్యాప్ మనల్ని ఎలా తీసుకెళ్తే బ్లైండ్ గా దాని నమ్ముకుని వెళ్లిపోతాం. ఇలాగే గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని ప్రయాణం చేసిన ఓ కుటుంబం దారితప్పంది.. అదేంటో మీరే చదివేయండి.. నేటి యుగంలో ఎక్కడకి వెళ్లాలన్నా మనకు గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తుంది. దీంతో చాలా మంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్ ఫాలో అవుతారు. తద్వారా దారిలో ట్రాఫిక్ జామ్ ఉంటే ట్రాఫిక్ జామ్ లేని రూట్లను చూపిస్తుంది. అయితే ఇదే గూగుల్ మ్యాప్ ఒక్కోసారి దారి తప్పుతుంది. ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగ్గా తాజాగా కేరళలో జరిగిన ఇన్సిడెంట్ బయటకు రావడంతో ఇది సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. కేరళలోని కొట్టాయం నుండి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. వారు గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తుండగా.. దారి తప్పి కారు కాలువలో పడిపోయింది. దీన్ని గమనించిన స్థానిక ప్రజలు తక్షణమే స్పందించి కాలువలో పడిన కారులోని మనుషులను సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు సకాలంలో స్పందించి కారును తాడుతో కట్టి నలుగురిని సురక్షితంగా కాపాడారు. ఆతర్వాత కాలువలో పడిన వారి కుటుంబసభ్యులు వచ్చి అందరినీ ఇంటికి తీసుకెళ్లారు. తిరువతుక్కల్‌-నట్టకోమ్‌ సిమెంట్‌ జంక్షన్‌ బైపాస్‌ మీదుగా కుటుంబం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే గూగుల్ మ్యాప్ ని ఫాలో అయినా.. ఒక్కోసారి అది ఏ రూట్ లో తీసుకెళ్తుందో గమనించుకోవాలంటూ ఈఇన్సిడెంట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..