Google down: గూగుల్ కు గుండేపోటు వచ్చిందంటూ నెట్టింట్లో నెటిజన్లు ఓ ఆటేడుసుకున్నారు. మంగళవారం ఉదయం కొంతసేపు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏమి సెర్చ్ చేసినా ఎర్రర్ చూపించడంతో నిమిషాల వ్యవధిలో గూగుల్ కు వేలాది మంది యూజర్లు కంప్లైంట్ చేశారు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందిచలేదు. అయితే సేవలను త్వరగా పునరుద్ధరించండి..పనిలో ఇబ్బంది పడుతున్నామంటూ చాలా గూగుల్ కు ఫిర్యాదు చేశారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ తో పాటు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటివి పనిచేయలేదంటూ యూజర్లు మండిపడ్డారు. గూగుల్ సెర్చ్ చేసే సమయంలో 502 ఎర్రర్ డిస్ ప్లే అయింది. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్ పై ఆధారపడిన వారికి అంతరాయం ఏర్పడింది. మరోవైపు మీమ్స్ తో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఓ ఆటాడుకున్నారు.
trying to revive internet explorer with google being down pic.twitter.com/zujf1vNbpr
ఇవి కూడా చదవండి— mou ☘️? (@pxresouls) August 9, 2022
గూగుల్ డౌన్ అవడంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఒక బొమ్మ గుండెను నొక్కుతున్న వీడియోను పోస్టు చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో నెటిజన్ వ్యగ్యంగా స్పందిస్తూ.. డేటా సెంటర్ లో పెద్ద ఎలక్రికల్ పేరుడు కారణంగా గూగుల్ ఆగిపోయి ఉండొచ్చు.. ముగ్గురు గాయపడ్డారంటూ ట్వీట్ చేశాడు. ఇలా క్షణాల వ్యవధిలో #Googledown పేరుతో వేలాది మంది నెటిజన్లు ట్వీట్లు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి