
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నోలు, విశేషాలు నిండివున్నాయి. మన కంటికి కనిపించని ఎన్నో రహస్యాలు కూడా ఈ సృష్టిలో దాగి ఉన్నాయి. అలాంటి వింతలు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం చూస్తుంటాం.. వాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేకపోతుంటాం.. ఇటీవల పాములకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం వాటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే, మనం కూడా కొన్ని రకాల సర్పాలను చూసుంటాం. కానీ, ఇక్కడ కనిపించిన నాగుపాము మాత్రం చాలా అరుదైనది.. ఇలాంటి పామును ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు..
వైరల్ వీడియోలో ఒక నాగుపాము పడగవిప్పి ఉండటం కనిపిస్తుంది. కానీ, ఈ పాము మిగతా సర్పాలకు భిన్నంగా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఈ వింత పామును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సూర్యుడి కాంతి ఆ పాము పడగపై పడటం వల్లే ఆ సర్పం అలా మెరిసిపోతుందని కొందరు అంటాన్నారు. ఇలాంటి పాములే శక్తివంతమైన నాగమణులను కలిగి ఉంటాయని మరికొందరు నెటిజన్లు భావిస్తున్నారు. జన్యుపరమైన మార్పులు కారణంగానే పాము పడగ భాగం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
నాగుల పంచమి నాడు ఇలాంటి వీడియో వైరల్ కావడంతో మరికొందరు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. విశేషమైన రోజున ఇలాంటి వింత పామును చూడటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తూ మరింత వైరల్ గా మార్చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..