ఆంధ్రప్రదేశ్‌లోని సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ధ్వంసమైన ధ్వజస్తంభం తొలగించేందుకు కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. వారికి ఓ భారీ శబ్దం వినిపించింది. ఏంటా అని మట్టిని బయటికి తీసి చూడగా వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ కథేంటో తెలియాలంటే..!
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానంలోని రామాలయంలో ఈ నెల 9వ తేదీన ధ్వజస్తంభాన్ని పున:ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకముందు ధ్వంసమైన ధ్వజస్తంభాన్ని తొలగించే పనిలో భాగంగా కూలీలు తవ్వకాలు జరిపినప్పుడు.. వారికి బంగారంతో తయారు చేసిన గరుడ మంత్రం, 112 రాగి నాణేలు, రాగితో తయారు చేసిన ధ్వజ స్తంభ నమూనా పత్రాలు లభ్యమయ్యాయి. వీటిని రెవెన్యూ అధికారులు.. పోలీసులు, దేవస్థానం సిబ్బంది సమక్షంలో అన్నీ పరిశీలించి.. అనంతరం జాగ్రత్తగా భద్రపరిచారు.