Viral: ఒరెయ్ ఇలా తయారయ్యారు ఏంట్రా.. మెట్రోలోనే పాడు పని.. ఆ తర్వాత

|

Jul 29, 2024 | 1:19 PM

కాలేజీ బాటలో ఎంజాయ్‌మెంట్‌ మిషతో ఎంతో మంది యువత గంజాయికి బానిసలవుతున్నారు. బడి బాటలో గంజాయి గుప్పుమంటోంది. పల్లె..పట్నం అనే తేడా లేకుండా డ్రగ్‌ కల్చర్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. మత్తుకు బానిసై బంగారంలాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకోవడమే కాకుండా మైకంలో నేరాలకు పాల్పడుతూ బతుకు నిర్వీర్యంచేసుకుంటున్నారెందరో.

Viral: ఒరెయ్ ఇలా తయారయ్యారు ఏంట్రా.. మెట్రోలోనే పాడు పని.. ఆ తర్వాత
Man With Ganja
Follow us on

గంజాయి.. ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారిపోయింది. డ్రగ్స్‌ను రూపుమాపేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఈ జాడ్యం మాత్రం వీడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా గంజాయి అయితే ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరకుతుంది. యూత్‌ పెద్ద ఎత్తున గంజాయి అలవాటు పడటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే.. దేశం పీకల్లోతు కష్టాల్లోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో గుట్టుచప్పుడు కాకుండా.. గంజాయి తాగేవారు. కానీ ఇప్పుడు చాలా మంది బాహాటంగానే ఈ పాడు పనికి పూనుకుంటున్నారు. కొందరైతే.. తాము ఏదో గొప్ప పని చేసినట్లు.. ఆ ఫోటోలను, వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా ఓ యువకుడు చెన్నై మెట్రోలో ఓ యువకుడు గంజాయిని రోల్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమ్కోనగర్‌ నుంచి విమానాశ్రయం వరకు వెళ్లే మెట్రో ట్రైన్‌లో ఓ యువకుడు ప్రయాణికులు విచ్చలవిడిగా ప్రవర్తించినట్లు తెలిసింది. అన్నాడీఎంకే సీనియర్ నేత.. జయకుమార్‌ ఈ ఫొటో తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టి సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తండయార్‌పేటకి చెందిన భువనేష్‌‌గా గుర్తించారు. అతను ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరి నుంచి కొనుగోలు చేశాడమే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..