AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oldmonk Rum Tea: ఓల్డ్‌మంక్‌తో గరం గరం తందూరీ ఛాయ్‌.. లొట్టలేసుకుని తాగుతోన్న కస్టమర్లు.. ఎక్కడంటే?

ఈనేపథ్యంలో టీ అమ్ముకునే వ్యాపారి కూడా త‌న ఛాయ్‌కి గిరాకీ పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఓల్డ్ మాంక్ ర‌మ్.. గ‌రం గ‌రం ఛాయ్‌.. ఈ రెండింటిని క‌లిపి తందూరీ టీ త‌యారుచేశాడు.

Oldmonk Rum Tea: ఓల్డ్‌మంక్‌తో గరం గరం తందూరీ ఛాయ్‌.. లొట్టలేసుకుని తాగుతోన్న కస్టమర్లు.. ఎక్కడంటే?
Oldmonk Rum Tea
Basha Shek
|

Updated on: Nov 06, 2022 | 6:39 PM

Share

మెదడుకు సాంత్వన కలిగించే టీలో రకరకాల ఫ్లేవర్లు, ఉంటాయి. అల్లం టీ, బాదం టీ, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, ఊలాంగ్‌ టీ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇదిలా ఉంటే కస్టమర్లను ఆకట్టుకోవడానికి వ్యాపారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఈనేపథ్యంలో టీ అమ్ముకునే వ్యాపారి కూడా త‌న ఛాయ్‌కి గిరాకీ పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఓల్డ్ మాంక్ ర‌మ్.. గ‌రం గ‌రం ఛాయ్‌.. ఈ రెండింటిని క‌లిపి తందూరీ టీ త‌యారుచేశాడు. గోవా బీచ్ లోని ఓ టీ స్టాల్ వ్యాపారి ఈ వెరైటీ ఛాయ్‌ను తయారుచేయగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఛాయ్‌ పేరు మాత్రమే కాదు తయారీ కూడా ఎంతో ప్రత్యేకంగానే ఉంటుంది. వీడియో ప్రకారం.. ఛాయ్‌ తయారీ పాత్రలో మొదట కొద్దిగా బెల్లం పొడి వేసి మంటపై ఉంచాడు. ఆతర్వాత అందులో ఓల్డ్‌ మాంక్‌ రమ్‌ పోశాడు. ఆపై టీ పొడి వేశాడు. చివరిగా వేడి వేడి టీని మ‌ట్టి క‌ప్పుల్లో పోసి కస్టమర్లకు సర్వ్‌ చేయడం మనం చూడవచ్చు.

గోవాలో టూరిస్టులు ఎక్కువగా తిరిగే బీచ్‌లో ఈ టీ స్టా్ల్‌ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో బీచ్‌ సందర్శనకు వచ్చిన వాళ్లందరూ లొట్టలేసుకుని మరీ వెరైటీ ఛాయ్‌ని తాగుతున్నారు. ఈ టీ రుచిని కొంద‌రు మెచ్చుకుంటుంటే, మ‌రికొంద‌రేమో అస్సలు బాగాలేదు అంటూ పెదవి విరిస్తున్నారు. కాగా అత‌ను టీ త‌యారుచేస్తున్న వీడియోను ఒక యూజ‌ర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!