
Trending Video: శ్రావణ మాసం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే, ఈ మాసంలో మనిషి మనసులో ఉత్సాహం మెలుగుతుంది. శ్రావణ మాసంలో చాలాచోట్ల వనభోజనాలకు వెళ్తుంటారు. అక్కడ అంతా కలిసి సరదాగా గడిపిన వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో ముగ్గురు మహిళలు ఊయల ఊగుతున్నట్లు వీడియోలు చూడొచ్చు.
శ్రావణ మాసంలో సరదాగా ఊయల ఊగుదామని అనుకున్న ఈ మహిళలు.. అనుకోని ప్రమాదంలో పడిపోయారు. వీరి ఉత్సాహం క్షణంలోనే ప్రమాదంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఓ పొలంలో తీసినట్లుగా ఉంది. గ్రామంలోని కొందరు ఆడపిల్లలు అక్కడ చెట్టుకు ఊయల కట్టి, ఊగుతుండడం చూడొచ్చు. దాదాపు ముగ్గురు అమ్మాయిలు ఒకే ఊయలపై కూర్చొని ఆనందిస్తున్నారు. కానీ, ఒక్కసారిగా వారి సంతోషం దుఃఖంగా మారింది. అమ్మాయిల ఊయల ఒక్కసారిగా విరిగిపోయింది.
ఊయల విరగడంతో కింద పడిపోయిన మహిళలు..
ఊయల విరిగిపోవడంతో ఇద్దరు అమ్మాయిలు బురద నీటిలో పడిపోవడం వైరల్ వీడియోలో మీరు చూడొచ్చు. అయితే మూడో అమ్మాయి మాత్రం ఊయలకి వేలాడుతూనే ఉంటుంది. కింద పడిన తర్వాత కూడా గాలిలో ఊయల ఊగుతూనే ఉంది. దీంతో కింద పడిన బాలికలు గాయపడ్డారు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో mrsingh8394 అనే ఖాతాతో పోస్ట్ చేశారు. జులై 30న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దాదాపు 2.50 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.