Little Sister Love: 6 నెలల తర్వాత అక్కని చూసిన చెల్లెలు ప్రేమ.. వీడియో చూస్తే నాకు ఇలాంటి చెల్లికావాలని అనడం ఖాయం

|

Dec 08, 2022 | 11:53 AM

ఈ వీడియోలో ఓ రూమ్‌లో ఓ బాలిక చదువుకుంటూ ఉంది. ఇంతలో ఆ రూమ్‌లోకి మరో యువతి ఎంటరయింది. అంతే ఆమెను చూడగానే ఆ బాలిక సర్‌ప్రైజ్‌ అయిపోయింది. ఆరు నెల‌ల త‌ర్వాత సడన్‌గా ఇంటికి వ‌చ్చిన తన అక్కను చూడ‌గానే షాక్ తింది.

Little Sister Love: 6 నెలల తర్వాత అక్కని చూసిన చెల్లెలు ప్రేమ.. వీడియో చూస్తే నాకు ఇలాంటి చెల్లికావాలని అనడం ఖాయం
Little Sister Love
Follow us on

సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ ఇల్లు రణరంగమే. నిత్యం కీచులాడుకుంటూ అల్లరి చేస్తూ పెద్దలను తెగ విసిగిస్తారు. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒకటైపోతారు.. ఎంతో ప్రేమగా ఉంటారు. వారు నిత్యం కీచులాడుకున్నా కొద్దిసేపు ఒకరికొకరు క‌న‌ప‌డ‌క‌పోతే విల‌విల్లాడిపోతారు. తాజాగా అలాంటి అక్కా చెల్లెళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్యూట్‌ సిస్టర్స్‌ అంటూ వారి ఆప్యాయతకు మురిసిపోతున్నారు.

ఈ వీడియోలో ఓ రూమ్‌లో ఓ బాలిక చదువుకుంటూ ఉంది. ఇంతలో ఆ రూమ్‌లోకి మరో యువతి ఎంటరయింది. అంతే ఆమెను చూడగానే ఆ బాలిక సర్‌ప్రైజ్‌ అయిపోయింది. ఆరు నెల‌ల త‌ర్వాత సడన్‌గా ఇంటికి వ‌చ్చిన తన అక్కను చూడ‌గానే షాక్ తింది. వెంట‌నే అక్కను హ‌గ్ చేసుకుని ముద్దులు పెట్టేస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయింది. వ‌ర్జినియా కా ఉల్ప్ అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్లో షేర్ చేశారు. ఆరు నెల‌ల త‌ర్వాత ఇంటికొచ్చి లిటిల్ బేబీ సిస్టర్‌ను స‌ర్‌ప్రైజ్ చేశా.. ఆమె ఎలా రియాక్ట్ అయిందో చూడండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

చెల్లెలు ప్రేమ

ఈ వీడియోను రెండు లక్షలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు వీడియోచూసి చాలామంది స్పందించారు. సోక్యూట్‌.. వీడియో చూసాక నా కన్నీళ్లు ఆగలేదంటూ ఓ యూజర్‌ రాసుకొస్తే.. సిస్టర్స్‌ బాండింగ్‌ మనసును తాకిందంటూ మరొకరు కామెంట్‌ చేశారు. మరొకరు  “నాకు కూడా ఒక చెల్లెలు ఉంటే బాగుండునను” అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..