Viral Video: జిరాఫీ ఇచ్చిన పంచ్‌కు బిత్తరపోయిన సింహం.. వీడియో చూస్తే వారెవ్వా అనాల్సిందే..

అడవిలో జిరాఫీ సింహంపై చేసిన అనూహ్య పోరాటానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సింహం దాడికి ప్రయత్నించగా, పక్షి హెచ్చరికతో అప్రమత్తమైన జిరాఫీ, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మెరుపు వేగంతో సింహంపై ఎదురుదాడి చేసింది. బలహీనంగా కనిపించినా, ఆ జిరాఫీ పోరాట పటిమ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: జిరాఫీ ఇచ్చిన పంచ్‌కు బిత్తరపోయిన సింహం.. వీడియో చూస్తే వారెవ్వా అనాల్సిందే..
Giraffe Vs Lion Viral Video

Updated on: Nov 16, 2025 | 4:43 PM

అడవిలో జీవనం అంటే కేవలం బలం, పరిమాణం మాత్రమే కాదు.. మెరుపు వేగంతో స్పందించే సామర్థ్యం ఉండాలి. భారీ పరిమాణం ఉన్నప్పటికీ జిరాఫీ సింహం కంటే అది బలహీనంగానే ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియో ఈ అంచనాలను తలకిందులు చేసింది. జిరాఫీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సింహానికి ఇచ్చిన పంచ్ వారెవ్వా అనిపించింది.

పక్షి హెచ్చరికతో

ఆ వీడియోలో ఒక జిరాఫీ చెరువు వద్ద ప్రశాంతంగా నీరు తాగుతూ.. చుట్టూ ఉన్న ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోనట్లు కనిపిస్తుంది. సింహం దీనిని సులభమైన వేటగా భావించి, అదను చూసి జిరాఫీ వైపు దూసుకెళ్లింది. సరిగ్గా అప్పుడే ఒక చిన్న పక్షి జిరాఫీ వైపు వేగంగా ఎగిరింది. ఈ కదలికతో అప్రమత్తమైన జిరాఫీ తల పైకెత్తి చుట్టూ చూసింది. ప్రమాదాన్ని పసిగట్టిన అది, ఆలస్యం చేయకుండా పరిగెత్తింది.

ఇవి కూడా చదవండి

సింహంపై మెరుపు దాడి

జిరాఫీ పారిపోవడం మొదలుపెట్టగానే సింహం ఒక్కసారిగా దానిపై దాడికి యత్నించింది. సింహం జిరాఫీ వెనుక కాలుపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ బలహీనంగా కనిపించిన ఆ జిరాఫీ ఊహించని విధంగా.. వెనక్కి తిరిగి చాలా గట్టిగా తన్నింది. ఆ దెబ్బకు సింహం ఒక్క క్షణం తన పట్టును కోల్పోయి.. అక్కడే ఆగిపోయింది.

తప్పించుకున్న జిరాఫీ

ఆ దెబ్బ తర్వాత సింహం వెంటనే ఆగిపోయింది. జిరాఫీ కొద్ది దూరం వెళ్లాక పరుగును తగ్గించి, సింహం వైపు తిరిగి చూసింది. సింహం దూరంగా నిలబడి ముందుకు కదలకపోవడంతో అంతా సేఫ్ అనుకుని జిరాఫీ కూడా ఆగిపోయింది. సుమారు 37 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్.. అడవిలో ప్రతి జీవి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తుందనే విషయాన్ని.. ఈ వీడియోలో చూడొచ్చు