Viral Video: నోట్లోంచి పెద్ద సాలె పురుగు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

సాలె పురుగును చూడగానే చాలామందికి కడుపులో దేవుతున్నట్లు అనుపిస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. దాని ఆకారం చూడగానే అదో వికారమైన ఫీలింగ్ కలుగుతుంది.

Viral Video:  నోట్లోంచి పెద్ద సాలె పురుగు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Spider Viral Video

Updated on: Nov 14, 2021 | 8:58 AM

సాలె పురుగును చూడగానే చాలామందికి కడుపులో దేవుతున్నట్లు అనుపిస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. దాని ఆకారం చూడగానే అదో వికారమైన ఫీలింగ్ కలుగుతుంది. స్పైడర్ మ్యాన్ అందరికీ నచ్చతాడు కానీ స్పైడర్ మాత్రం నచ్చదు. కొంచెం పెద్ద సైజు సాలీడు కనిపిస్తే.. షాకై చూసేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ద సైజు సాలె పురుగును నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని నోట్లో నుంచి బయటకు తీస్తూ వీడియో చిత్రీకరించాడు. వామ్మె ఈయనేం మనిషి అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఫోటో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా.. ఇక వీడియో చూస్తే కంగతినడం ఖాయం.

ముందుగా వీడియో వీక్షించండి

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు  జే బ్రూవర్.  జూ కీపర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే ఇలాంటి షాకింగ్ ఫీట్స్  ఎన్నో చేసి వాటిని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జే సోషల్ మీడియా ఖాతాల్లో ఇలాంటి వైరల్ వీడియోలు చాలానే ఉన్నాయి. ఇతని ఇన్ స్టా ఖాతాకు 5.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటేనే అతని వీడియోల క్రేజ్ ఏ పాటిదో అర్థమయి ఉంటుంది.

Also Read: Viral Photo: ‘ఎలా వస్తాయ్ బాస్ ఇలాంటి ఐడియాలు’.. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఫోటో

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్..