
ప్రకృతిలో ఒక్కోసారి ఊహించని వింతలు కనిపిస్తుంటాయి. కానీ కొన్ని వింతలు ఆశ్చర్యంతో పాటు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో భారీ కొండచిలువలు ఒకే చోట గుంపుగా దర్శనమివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రా ప్రాంతంలోని అటవీ సరిహద్దు గ్రామాల సమీపంలో స్థానికులు వెళ్తుండగా, ఒక పొదలో ఏదో కదులుతున్నట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ ఒకదానిపై ఒకటి పడి ఉన్న భారీ కొండచిలువలను చూసి వారు షాక్ తిన్నారు.. ఇవి సాధారణ పాములు కావు, ఒక్కొక్కటి దాదాపు 10 నుండి 15 అడుగుల పొడవు ఉన్న కొండచిలువలు. ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకుని ఒక పెద్ద ముద్దలా (Cluster) పడి ఉన్నాయి.
ఈ భయంకరమైన దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇది నిజంగా భయంకరంగా ఉంది. ఆ దారిలో వెళ్లాలంటే ధైర్యం సరిపోదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వన్యప్రాణి నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పాములు ఇలా గుంపులుగా కనిపించడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. సాధారణంగా సంతానోత్పత్తి (Mating) సమయంలో లేదా చలికాలం ముగిసిన తర్వాత సూర్యరశ్మి ద్వారా వెచ్చదనం పొందడానికి ఇవి ఇలా ఒకే చోట చేరుతుంటాయి. కొండచిలువలు మనుషులపై దానంతట అవి దాడి చేయవు. కానీ, వాటి జోలికి వెళ్తే ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
ప్రస్తుతం ఈ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. గ్రామస్థులు పొలాల్లోకి లేదా అడవి ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోలలో ఒకటిగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..