Watch: ప్రత్యేక విమానంలో పాండాలు తరలింపు.. ఎక్కడికి, ఎందుకో తెలుసా..?

|

Oct 16, 2024 | 2:13 PM

చైనా దేశంలోని బావో లీ, క్వింగ్ బావో పాండాలను చైనా ప్రభుత్వం అమెరికాకు పంపినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 24 సంవత్సరాలలో బీజింగ్ నుండి వచ్చిన పాండాలను US రాజధాని స్వాగతించడం ఇదే మొదటిసారి. ఈ పాండాలను వాషింగ్టన్‌లోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు.

Watch: ప్రత్యేక విమానంలో పాండాలు తరలింపు.. ఎక్కడికి, ఎందుకో తెలుసా..?
Pandas By Special Plane
Follow us on

చైనా నుండి రెండు పెద్ద పాండాలు వాషింగ్టన్‌లో అడుగుపెట్టాయి. చైనా జాతీయ సంపదగా భావించే పాండాలను అమెరికాకు బహుమతిగా పంపింది. దీంతో చైనాకు చెందిన రెండు పాండాలు ప్రత్యేక విమానంలో అమెరికాకు చేరుకున్నాయి. అమెరికాతో చైనా 1972లో చేసుకున్న ‘పాండా దౌత్యం’ ఒప్పందంలో భాగంగా తమ దేశంలోని బావో లీ, క్వింగ్ బావో పాండాలను చైనా ప్రభుత్వం అమెరికాకు పంపినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 24 సంవత్సరాలలో బీజింగ్ నుండి వచ్చిన పాండాలను US రాజధాని స్వాగతించడం ఇదే మొదటిసారి. ఈ పాండాలను వాషింగ్టన్‌లోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు.

“పాండా ఎక్స్‌ప్రెస్” అని పిలవబడే FedEx కార్గో విమానం 3 సంవత్సరాల వయస్సు గల బావో లి, క్వింగ్ బావోలతో మంగళవారం ఉదయం 9:53 గంటలకు వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయంలో దిగింది. గట్టి భద్రత, భారీ మీడియా కవరేజీ మధ్య జాగ్రత్తగా వీటిని అమెరికాకు తరలించారు. అక్కడి నుండి, రెండు పాండాలను స్మిత్‌సోనియన్స్ నేషనల్ జూకి ట్రక్‌లో తీసుకువెళ్లారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఉన్నత స్థాయి స్వాగతం, అత్యంత రక్షణ మధ్య తరలివచ్చిన ఈ అందమైన పాండాలను ప్రత్యక్షంగా చూడాలను చూసేందుకు అమెరికన్ పాండా అభిమానులు వేచి ఉన్నారు. జూ సభ్యులు జనవరి 10, 2025 నుండి పాండాలను చూసేందుకు అనుమతించనున్నట్టుగా జూ ప్రకటించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..