Viral Video: మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

|

Oct 05, 2021 | 9:19 PM

Viral Video: అడవి ప్రపంచం భిన్నంగా ఉంటుంది. అక్కడి నియమాలు డిఫరెంట్. క్రూర జంతువులు వేటను కొనసాగించాలి. వాటికి దొరక్కుండా సాధు జంతువులు..

Viral Video: మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!
Crocodile
Follow us on

అడవి ప్రపంచం భిన్నంగా ఉంటుంది. అక్కడి నియమాలు డిఫరెంట్. క్రూర జంతువులు వేటను కొనసాగించాలి. వాటికి దొరక్కుండా సాధు జంతువులు తమ ప్రాణాలను రక్షించుకోవాలి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అవుతుంటాయి. ఈ కంటెంట్‌నే జనాలు బాగా ఇష్టపడతారు. ఇక ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. ఈ వీడియోను చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాకవుతారు.!

మొసలి.. సముద్రపు అలెగ్జాండర్‌గా పిలవబడే ఈ జంతువు ఎంతటి బలశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఎంతటి జంతువునైనా ఇట్టే మట్టుబెట్టేస్తుంది. అలాంటి మొసలి తన ఆహారంగా మరో మొసలి(Gator Species)ని తినడం మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ వీడియో చూడండి..

వైరల్ వీడియో ప్రకారం.. సౌత్ కరోలినాలో ఓ మొసలి చెరువు ఒడ్డున మరో మొసలి(Gator)ని నమిలి తింటుంది. దీనిని టేలర్ సోపెర్ అనే వ్యక్తి వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తక్కువ వ్యవధిలోనే ఈ క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.8 మిలియన్ వ్యూస్ రాగా, 47,800 మంది లైక్ కొట్టారు. అలాగే 10,600 రీ-ట్వీట్లు వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.

Also Read: