బాబోయ్‌..ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..! దీని పొడవు తెలిస్తే..

ఈ అనకొండలు ప్రపంచంలోనే అతిపెద్దవి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనకొండలు 24 అడుగుల పొడవు కంటే భారీగా పెరుగుతాయని కొంతమంది వౌరానీలు పేర్కొంటున్నారు. ఇది నిజమైతే, ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పాము ఇదే అవుతుంది. ఇంతటీ భారీ కొలతలతో ఇది ఇప్పుడు అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన పాముగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

బాబోయ్‌..ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..! దీని పొడవు తెలిస్తే..
Green Anaconda

Updated on: Apr 23, 2025 | 9:56 PM

అనకొండ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఒక పాము జాతిలో ఒక భారీ సర్పం. కానీ అనకొండలో కూడా అనేక జాతులు ఉన్నాయి. ఇవి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ, 2024లో శాస్త్రవేత్తలు అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఒక కొత్త జాతి జెయింట్ అనకొండను గుర్తించారు. ఈ భారీ అనకొండ గతంలో ఎప్పుడూ చూడని జెయింట్ అనకొండ జాతి. ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిమాణ రికార్డులను బద్దలు కొట్టింది.

అమెజాన్ వర్షారణ్యంలో ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్ద పామును గుర్తించారు. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ (యునెక్టెస్ అకాయిమా), దీని పొడవు 7.5 మీటర్లు (24.6 అడుగులు) వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని బరువు 500 కిలోగ్రాముల(1,100పౌండ్లు) బరువు ఉంటుంది. ఇంతటీ భారీ కొలతలతో ఇది ఇప్పుడు అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన పాముగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ అనకొండలు ప్రపంచంలోనే అతిపెద్దవి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనకొండలు 24 అడుగుల పొడవు కంటే భారీగా పెరుగుతాయని కొంతమంది వౌరానీలు పేర్కొంటున్నారు. ఇది నిజమైతే, ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పాము ఇదే అవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..