Viral: పిల్లే ఆత్మ రూపంలో ఆ చిన్నారి వద్దకు వచ్చిందా..? వెన్నులో వణుకు పుట్టిస్తోన్న వీడియో

తమ పెంపుడు పిల్లి మరణించిన కొద్ది రోజుల్లోనే... ఆ పిల్లి ఆత్మే మళ్లీ ఇంటికి వచ్చి తమ కుమార్తెను రక్షించిందా? ఓ చిన్నారి పడకగదిలో సీసీటీవీలో కనిపించిన పిల్లి ఆకారంలో నీడ.. 'కిటికీ దగ్గర ఏదో భయానకంగా ఉంది' అనే ఆ చిన్నారి మాటలు ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Viral: పిల్లే ఆత్మ రూపంలో ఆ చిన్నారి వద్దకు వచ్చిందా..? వెన్నులో వణుకు పుట్టిస్తోన్న వీడియో
Cat Shadow

Updated on: Jul 31, 2025 | 4:11 PM

ఒక చిన్నారి పడకగదిలో సీసీటీవీ ద్వారా కనిపించిన అద్భుత దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం అవుతోంది. ఆ ఫుటేజ్‌లో చిన్నారి మంచం మీద పడుకుని ఉండగా.. పక్కనే ఓ పిల్లి ఆకారంలో ఉన్న నీడ రూమ్‌లోకి వచ్చి ఆమె దగ్గరికి వచ్చిందట. సీసీ కెమెరాలో ఈ దృశ్యాన్ని చూసిన ఆమె తల్లి..  ఆశ్చర్యపోయి వెంటనే రూంకు పరుగెత్తింది. “ఇక్కడ పిల్లి కనిపించింది?” ఏది అని అడగ్గా.. పిల్లి ఏం రాలేదు అమ్మ… కానీ కిటికీ దగ్గర ఏదో ఉన్నట్లు నాకు భయం కలుగుతుందని  పాప సమాధానం చెప్పిందట.

ఆ మాట విన్న వెంటనే పాప తల్లిదండ్రుల మెదళ్లలో వెంటనే ఒక విషయం తోచింది.  ఆ కుటుంబం కొద్ది రోజులక్రితమే తమ పెంపుడు పిల్లిని కోల్పోయిందట. దీంతో ఆ పిల్లి ఆత్మే చిన్నారిని కాపాడేందుకు వచ్చిందేమోనని నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

ఈ ఘటనపై చాలామంది తమ అనుభవాలూ షేర్ చేశారు. “నాకూ మా పెంపుడు జంతువు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అది పక్కనే ఉన్నట్టే అనిపించేది” అని ఒకరు కామెంట్ పెట్టారు. “పిల్లలకి కనిపించే అటువంటి విషయాలను మనం లైట్ తీసుకుంటాం. కానీ వాటిలో నిజం ఉండవచ్చు” అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఒకవేళ అది నిజంగా ఆ పిల్లి ఆత్మ అయితే… అది ఆ చిన్నారిని ఏదో చెడు నుంచి(దుష్ట శక్తుల నుంచి) రక్షించడానికి వచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు అంటున్నారు నెటిజన్లు.  అయితే ఈ సంఘటన సరిగ్గా ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్నదాన్ని క్లియర్‌గా వీడియోను షేర్ చేసిన వ్యక్తి కూడా వెల్లడించలేదు. అయితే ఈ క్లిప్ ఎవరో కావాలని క్రియేట్ చేసిందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.