Australia Kangaroo: సోషల్ మీడియా(Social Media)లో తరచూ జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు(Viral Video) మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెంపుడు జంతువులు తమను ఎంతగానో ప్రేమించే యజమానులతో ఎంతో సన్నిహితంగా ఉంటాయి. వారితో ఆడుకుంటాయి.. ఆ సమయంలో వాటి చేష్టలు చాలా సరదాగా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. రెండు కాళ్లతో లేచి… తోకతో బ్యాలెన్స్ చేసుకుంటూ… ఊగుతున్నట్లు ఉండే కంగారూలను చూస్తే ఎవరికైనా నవ్వు రావడం సహజం. అలాంటి ఓ పిల్ల కంగారూ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోని చూస్తే మీకు కూడా నవ్వు వచ్చేస్తుంది.
ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోని జనవరి 23న పోస్ట్ చేస్తూ.. “పర్సనల్ ట్రైనర్” అని క్యాప్షన్ పెట్టారు. లక్షలమంది వీక్షిస్తున్న ఈ వీడియోలో ఓ ఇంటి హాల్ లో ఓ వ్యక్తి పుషప్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన పిల్ల కంగారూ… ఆయనకు సాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. ఆయన్ని దగ్గరుండి.. “అదీ అలా చెయ్యాలి… ఊ మళ్లీ మళ్లీ” అంటున్నట్లుగా అతనితో పుషప్స్ చేయించింది. ఆ సమయంలో ఆ ఇంట్లోని కుక్క అటుగా వెళ్లింది. ఆ కుక్కని చూసి కూడా కంగారూ కంగారు పడకుండా… అతనితో అలా ఆడుతూనే ఉంది. ఆ వ్యక్తి కూడా ఆ పిల్ల కంగారూ తనను డిస్టర్బ్ చేస్తున్నా విసుక్కోకుండా ఎంజాయ్ చేశారు. కంగారూ చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.. దీనిపై ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. “ఓ మంచి ఫ్రెండ్ ఎప్పుడూ నీకు సాయంగా ఉంటారు. ఎప్పుడూ” అని ఓ యూజర్ స్పందించగా… “చాలా అందంగా ఉంది” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
Personal trainer.. ? pic.twitter.com/JlabEEK3EB
— Buitengebieden (@buitengebieden_) January 23, 2022
Also Read: పబ్ లో అమ్మాయిలతో ఆర్జీవి రచ్చ రచ్చ.. బతికితే నీకులా బతకాలి బాసు అంటున్న నెటిజన్లు..