Trending: నెట్టింట ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. రోజు రకరకాల వీడియోలు ఫోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో మీమ్స్ కూడా విపరీతంగా సర్కులేట్ అవుతున్నారు. ఈ మీమ్ పేజీలకు ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. నెటిజన్ల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ క్రమంలోనే మీమ్ క్రియేటర్స్ రోజురోజుకు క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ కొందరు లిమిట్స్ కూడా క్రాస్ చేస్తున్నారు. కొంచెం ఎబ్బెట్టుగా ఉండేలా.. కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మెజార్టీ మీమ్ క్రియేటర్స్ మాత్రం హద్దుల్లో ఉంటూనే ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక కొన్ని పోస్టులు కూడా మీమ్స్ మాదిరిగానే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ పరీక్షల్లో ప్రశ్నలకు తమకు ఆన్సర్స్ రానప్పుడు రాసే ఫన్నీ ఆన్సర్స్ తెగ ఆకట్టుకుంటాయి. అలాంటి ఫోస్ట్ ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఉపమాలంకారం గురించి రాయమంటే.. ఓ స్టూడెంట్ ఉప్మా(Upma) ఎలా తయారు చేయాలో రాశాడు. ఉప్మా తయారుచేయడానికి ఏమేం కావాలో అన్నీ సవిరంగా రాసుకొచ్చాడు. తయారు చేసే పద్దతిని కూడా చక్కగా వివరించాడు. అతని ఆన్సర్‌కి టీచర్ మార్కులు వేయకపోయినా.. నెటిజన్లు మాత్రం కామెంట్లతో హెరెత్తించారు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ పంచ్‌లు పేలుస్తున్నారు. ‘అతను ఫ్యూచర్‌లో మంచి చెఫ్ అవుతాడు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.’ఆ టీచర్ మార్కులు వేయాల్సింది.. ఆమెకు ఉప్మా చేయడం నేర్పించాడు’ అని మరో యూజర్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. ‘అతని తెలుగుకి తెగులు పట్టింది’ అని మరొకరు రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి