వార్నీ.! ఇంత కథ ఉందా..ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే

ఇప్పుడంతా వస్తువులను సురక్షితంగా ప్యాక్ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్న బబుల్ ర్యాప్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఇది మొదట ప్యాకేజింగ్ కోసం తయారు చేయలేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఇంతకీ ఈ బబుల్‌ ర్యాప్‌ దేని కోసం తయారు చేశారు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన కథేంటో ఇక్కడ చూద్దాం..

వార్నీ.! ఇంత కథ ఉందా..ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
Bubble Wrap

Updated on: Mar 11, 2026 | 4:05 PM

బబుల్ ర్యాప్ పాపింగ్ చేయడం, ఆ సౌండ్లు వినడం చాలా మందికి వింతైన కోరిక..పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ బబుల్స్‌ పాపింగ్‌ చేయటానికి ఇష్టపడతారు. ప్యాకేజీలో బబుల్ ర్యాప్ కనిపించగానే.. ప్రజలు దానిని పాపింగ్ చేయకుండా ఉండలేరు. ఇది చిన్న గాలి నిండిన బుడగలతో ఆడుకోవడం లాంటిది. ఇప్పుడంతా వస్తువులను సురక్షితంగా ప్యాక్ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్న బబుల్ ర్యాప్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఇది మొదట ప్యాకేజింగ్ కోసం తయారు చేయలేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఇంతకీ ఈ బబుల్‌ ర్యాప్‌ దేని కోసం తయారు చేశారు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన కథేంటో ఇక్కడ చూద్దాం..

వాస్తవానికి 1957లో అమెరికాకు చెందిన ఇంజినీర్లు అల్ఫ్రెడ్ ఫీల్డింగ్, మార్క్ చావానెస్ ఒక కొత్త రకమైన వాల్ డెకరేషన్ తయారు చేయాలని ప్రయత్నించారు. అందుకోసం రెండు ప్లాస్టిక్ షీట్ల మధ్య గాలి బుడగలు ఉండేలా తయారు చేశారు. ఇది గోడలకు అందంగా కనిపిస్తుందని భావించారు. కానీ, మార్కెట్లో దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. వాల్‌పేపర్‌గా ఈ ఆలోచన ఫేయిల్‌ అయింది. ఆ తర్వాత అదే పదార్థాన్ని ఇన్సులేషన్ మెటీరియల్గా ఉపయోగించాలని కూడా ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం కూడా పెద్దగా విజయవంతం కాలేదు. ఇలా రెండు సార్లు విఫలమైన తర్వాత, ఈ గాలి బుడగలతో ఉన్న ప్లాస్టిక్ షీట్ వస్తువుల రవాణా సమయంలో సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని వారు గుర్తించారు. ముఖ్యంగా సున్నితమైన వస్తువులు పగలకుండా ఉండేందుకు ఇది చాలా సహాయపడింది.

కొన్ని సంవత్సరాల తరువాత 1960 లో అతని కంపెనీ సీల్డ్ ఎయిర్ కార్పొరేషన్ స్థాపించబడింది. అదే సమయంలో IBM తన కొత్త 1401 మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంప్యూటర్ చాలా ఖరీదైనది. పెళుసుగా ఉండటం వలన సురక్షితమైన రవాణా ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. అప్పుడు సీల్డ్ ఎయిర్ బృందం వారి బబుల్ ర్యాప్ ప్యాకేజింగ్‌ను IBMకి ప్రదర్శించింది. అక్కడినుంచి బబుల్ ర్యాప్‌ను ప్యాకేజింగ్ మెటీరియల్‌గా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ప్రారంభించారు. మొదటిగా కంప్యూటర్ తయారీ సంస్థ IBM తమ కంప్యూటర్లను రవాణా చేయడానికి బబుల్ ర్యాప్‌ను ఉపయోగించింది. ఆ తర్వాత ఇది వేగంగా ప్రాచుర్యం పొందింది. వాల్‌పేపర్‌గా తయారై ఫెయిల్‌ అయిన బబుల్‌ ర్యాప్‌ అతి త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాకేజింగ్ మెటీరియల్‌గా మారింది. IBMతో దాని విజయం ఈ ఉత్పత్తికి కొత్త గుర్తింపును ఇచ్చింది. మొత్తం పరిశ్రమకు నాంది పలికింది. నేడు బబుల్ ర్యాప్ అనే పేరు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్, కానీ అది చాలా ప్రజాదరణ పొందింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ పదంగా ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బబుల్ ర్యాప్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఉండే గాలి బుడగలు వస్తువులపై పడే షాక్‌ను తగ్గిస్తాయి. దీంతో గాజు వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు వంటి వాటిని సురక్షితంగా తరలించవచ్చు. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్యాకేజింగ్ పదార్థంగా మారింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, బబుల్ ర్యాప్‌లోని గాలి బుడగలను పగలగొట్టడం చాలా మందికి సరదాగా అనిపిస్తుంది. ఈ సరదా కారణంగా ప్రతి సంవత్సరం జనవరి చివరి సోమవారం రోజును బబుల్ ర్యాప్ అప్రీషియేషన్ డే గా కూడా జరుపుకుంటారు. మొత్తానికి వాల్‌పేపర్‌గా ప్రారంభమైన ఒక చిన్న ప్రయోగం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వస్తువులను రక్షించే ప్రముఖ ప్యాకేజింగ్ పదార్థంగా మారడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us