Viral News: పిల్లలు ఇంటర్నెట్‌ వాడకుండా చేయాలనుకున్నాడు.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాడు.. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడంటే..

| Edited By: Ravi Kiran

Feb 23, 2022 | 7:45 AM

ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్‌ (Internet) కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ అంతర్జాలంలోనే గడుపుతున్నారు.

Viral News: పిల్లలు ఇంటర్నెట్‌ వాడకుండా చేయాలనుకున్నాడు.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాడు.. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడంటే..
Follow us on

ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్‌ (Internet) కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ అంతర్జాలంలోనే గడుపుతున్నారు. ఇక కరోనా (Corona),  లాక్‌డౌన్‌ (Lockdown)ల కారణంగా ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పిల్లల్లో మరీ ఎక్కువైంది. నిత్యం స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు పట్టుకునే తిరుగుతున్నారు. ఈక్రమంలో ఇలా తన పిల్లలు అర్ధరాత్రి నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడపడం ఒక తండ్రికి నచ్చలేదు. పిల్లలకు ఎంత చెప్పినా వారు వినకపోవడంతో ఒక ప్లాన్‌ వేశాడు. ఎవరికీ తెలయికుండా నెట్‌ సిగ్నల్న్‌ను నిరోధించే ఒక జామర్‌ను తీసుకొచ్చి ఇంట్లో అమర్చాడు. ఇంట్లో పిల్లలు త్వరగా పడుకుంటారనే ఆలోచనతో అర్ధరాత్రి 3 గంటల వరకు ఇంటర్నెట్ పనిచేయకుండా చేశాడు. మొత్తానికి తాను అనుకున్న ప్లాన్‌ బాగానే వర్కవుట్‌ అయింది

అయితే ఇక్కడే ఒక చిన్న తప్పు జరిగింది. సిగ్నల్‌ జామర్ వల్ల ఆ ఒక్క ఇంటికే కాదు, మొత్తం ఊరు ఊరంతా ఇంటర్నెట్ నిలిచిపోయింది. ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అసలు ఇంటర్నెట్ ఎందుకు ఆగిపోయిందో అర్థం కాక తలలు పట్టుకున్నారు. విషయం పోలీసుల వరకు కూడా వెళ్లింది. విచారణలో అసలు విషయం తెలియడంతో జామర్‌ పెట్టిన తండ్రిపై కేసు నమోదు చేశారు. ఫ్రాన్స్ లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ సిగ్నల్‌ జామర్లు వాడటం చట్టరీత్యా నేరం. అందుకే సదరు తండ్రిపై కేసు నమోదైంది. ఈ కేసులో అతనికి రూ. 30 వేల యూరోల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతను ఉపయోగించిన జామర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి

Astrology: ఈ రాశుల అమ్మాయిలు అందరి దృష్టిలో పడేందుకు తెగ ట్రై చేస్తారు.. డ్రామా క్వీన్స్ వీళ్లే..

IND vs SL: రోహిత్ శర్మ ఖాతాలో చేరనున్న భారీ రికార్డు.. మరో 12 సిక్సులు కొడితే..!