
రాజస్థాన్‌లోని భిల్వారాలో రెండు వింత గబ్బిలాలు కనిపించడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. షాపురా ప్రాంతంలోని సుర్లి కళ్యాణ్‌పురా గ్రామంలో ఈ విచిత్ర గబ్బిలాలను గుర్తించారు. వీటి రెక్కల పొడవు ఐదు అడుగులు, రెండు గబ్బిలాలు మూడు అడుగుల పొడవు ఉన్నాయి. ఒక గబ్బిలం ఎగిరిపోయింది, మరొకటి సమీపంలోని చెట్టుకు చనిపోయి వేలాడుతూ కనిపించింది. చనిపోయిన గబ్బిలాన్ని ప్రజలు నిశితంగా పరిశీలించినప్పుడు.. ఈ గబ్బిలం ముఖం నక్కను పోలి ఉందని వారు గ్రహించారు.
అయితే ఈ రకమైన గబ్బిలాలు భారత ఉపఖండం అంతటా కనిపిస్తాయని అటవీ శాఖ విశ్వసిస్తోంది. సుర్లి కళ్యాణ్‌పురా గ్రామ నివాసితులు తమ జీవితంలో మొదటిసారిగా ఇలాంటి గబ్బిలాలను చూశామని చెబుతున్నారు. కొందరు తమ మొబైల్ ఫోన్‌లను పని చెప్పి ఈ విచిత్ర గబ్బిలాల ఫోటోలు తీశారు.
విద్యుత్ తీగపై వాలినప్పుడు.. విద్యుదాఘాతం తగిలి ఒక గబ్బిలం నేలపై పడిపోయిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఉదయం వెలుతురుని చూడలేకపోయిన గబ్బిలం ఎగరలేకపోయింది. ఈ గబ్బిలానికి భయంకరమైన కళ్ళు, ముక్కు రంధ్రాలు విప్పి, తెరిచినప్పుడు పదునైన దంతాలు, కోణాల చెవులు, రెక్కల కింద పదునైన పంజాలు ఉన్నాయి.
మండల్‌గఢ్ అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ పాయల్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ జాతి గబ్బిలాలు సాధారణంగా భారత ఉపఖండంలో కనిపిస్తాయని అన్నారు. వీటి ముఖాలు నక్క లేదా కుక్క ముఖాలను పోలి ఉంటాయి, అందుకే వీటికి ఎగిరే నక్క అనే పేరు వచ్చింది. వీటికి కోణకారంలో చెవులు, పెద్ద కళ్ళు ఉంటాయి. వీటి ప్రధాన లక్షణం ఏమిటంటే పండ్లు, తేనె , పుప్పొడిని తింటాయి. మానవులకు ప్రమాదకరం కాదు. పరాగసంపర్కం , విత్తనాల వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాళ్ళతో సహా వీటి రెక్కలు విస్తరించినప్పుడు ఐదు అడుగుల వెడల్పు వరకు ఉంటాయి. రాత్రి చీకటిలో ఈ గబ్బిలాలు ఎరను గుర్తించడానికి రాడార్ లాంటి ఎకోలొకేషన్‌ను ఉపయోగిస్తాయి. అయితే ఇవి పగటిపూట గుడ్డిగా మారతాయి.
ఈ గబ్బిలాలు మానవులకు ప్రమాదకరం కాదు. ఆకలి కారణంగా మాంసాహారులుగా మారతాయి. రాత్రి సమయంలో చిన్న పక్షులు, ఎలుకలు, కుందేళ్ళను వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. ఈ గబ్బిలాలు కోటలోని చంబల్ అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..