Steve Waugh:స్టీవ్ వా ఫోటో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న చిత్రంలో.. స్టీవ్ వా పవిత్ర గంగా నది(ganga River) బనారస్ ఘాట్( banaras ghat) వద్ద హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు. అవును స్టీవ్ వా వారణాసిలోని గంగా తీరాన్ని సందర్శించారు. అయితే ఇప్పుడు కాదు ఈ సంఘటన 2017 మే నెలలో చోటు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
వారణాసిని సందర్శించిన స్టీవ్ వా: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ వా ప్రస్తుతం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు. అయితే ఈసారి క్రికెట్ కాదు. స్టీవ్ వా చిత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో స్టీవ్ వా కాశీకి వచ్చి ప్రవహిస్తున్న గంగ నదిలో బూడిదను నిమజ్జనం చేస్తున్నాడు. 2017లో స్టీవ్ వా తన సహచరులతో కలిసి బనారస్ ఘాట్ వద్దకు వచ్చి హిందూ ఆచారాల ప్రకారం తన స్నేహితుడు బ్రియాన్ చితాభస్మాన్ని పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసినప్పటి ఫోటో వైరల్ అవుతోంది. స్టీవ్ వా స్నేహితుడు బ్రియాన్ చెప్పులు కుట్టేవాడుగా పనిచేసేవాడు. అతనికి కుటుంబం ఫ్యామిలీ సభ్యులోను అంటూ ఎవరూ లేరు.
స్టీవ్ వా.. ఈ చెప్పులు కుట్టే స్నేహితుడి చివరి కోరిక.. హిందూ ఆచారాల ప్రకారం తన చితాభస్మాన్ని బెనారస్‌లోని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేయాలి. స్టీవ్ వా స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చాడు. తన స్నేహితుడి చివరి కోరికను అతనికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి.. భారతదేశానికి వచ్చి గంగా నది వద్ద బనారస్ ఘాట్ వద్ద పడవలో నిలబడి స్నేహితుడి చితా భస్మాన్ని గంగలో నిమజ్జనం చేశాడు.
ఆ సమయంలో స్టీవ్ వా మాట్లాడుతూ, ‘బ్రియన్ జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. అతనికి ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు. అయితే తన స్నేహితుడు తన బ్రియాన్ చితాభస్మాన్ని గంగానదిలో నిమజ్జనం చేసి దహన సంస్కారాలు జరపాలన్నదిచివరి కోరిక. నేను బ్రియాన్ కోరికను తీరుస్తానని వాగ్దానం చేశాను.. ఆ హామీని నెరవేర్చాను. ఇది అతని జీవితానికి సంబంధించిన చివరి కార్యక్రమం అని చెప్పాడు.
ఆస్ట్రేలియాకు చెందిన గొప్ప క్రికెటర్, కెప్టెన్లలో స్టీవ్ వా ఒకరు. ఆస్ట్రేలియా తరపున 168 టెస్ట్ మ్యాచ్‌లు, 325 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో 50.59 సగటుతో 10927 పరుగులు చేశాడు. అదే సమయంలో, వన్డే క్రికెట్‌లో 7569 పరుగులు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టీవ్ వా 35 సెంచరీలు కూడా చేశాడు.
अपने मित्र ब्रायन की अस्थियां विसर्जित करने वाराणसी पहुंचे आस्ट्रेलिया के पूर्व क्रिकेट कप्तान स्टीव वा! बड़ी आबादी विश्व भर में हिंदू धर्म और भारत की संस्कृति से प्रभावित हो रही है॥ ब्रायन का कोई परिवार नहीं था ओर उनकी अंतिम इच्छा थी कि उनका अंतिम संस्कार हिंदू धर्म के अनुसार हो pic.twitter.com/UQD4SzxGnL
— Dr. Rajat Arora (@IDoctorRajat) March 13, 2022
Also Read: