నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. కాదంటారా.. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమే. నీటిలో ఉందంటే దాన్ని పట్టుకోవడం కాదు.. దాని దగ్గరికి వెళ్లాలన్నా భయపడతారు. ఎందుకంటే దాని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుంటో అందరికీ తెలుసు. పళ్లతో చీల్చి చెండాడేస్తుంది. అలాంటి బాహుబలి గల మొసలిని బంధించడం అంటే.. నిజంగా గ్రేటే కదా..
వామ్మో చూడ్డానికే భయానరకంగా ఉంది కదా మొసలి. వామ్మో ఇంత మందా.. ఎందుకంటారా.. దాన్ని బంధించి.. మళ్లీ అడవుల్లోకి పంపేందుకు పడుతున్న పాట్లు ఇవి. 400 కిలోలు కలిగిన ఈ మొసలిని పట్టుకునేందుకు సుమారు ఏడెనిమిది మంది కష్టపడ్డారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది అమాంతం మింగేసే పనిచేస్తుందని అందరికీ తెలుసు. అందులోనూ అటవీశాఖలో పనిచేసే సిబ్బందికి ఇలాంటి క్రూరమృగాల గురించి మరింత ఎక్కువగా తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా బంధించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు అది కూడా సజీవంగా ఉన్న టైంలో దాన్ని బంధించి.. మూతి తెరవకుండా చేసి.. తరలించడం అంటే ఛాలెంజింగ్‌తో కూడుకున్న విషయమే. అలాంటి టాస్క్‌ను ఇదిగో ఈ ఫారెస్ట్ ఎంప్లాయిస్ ఫుల్‌ఫిల్ చేశారు.