అసలు ఆ ఆటగాడు వేసిన మాస్టర్ స్కెచ్ మాములుగా లేదు. శృంగారం చేసేందుకు.. తన సాక్స్‌లో కండోమ్‌ను దాచిపెట్టాడు. కట్ చేస్తే.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే పని కానిచ్చాడు. ఇంతకీ అతడు మరెవరో కాదు.. ఇజ్రాయిల్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫెలిక్స్ హల్ఫోన్. మ్యాచ్‌కు కొద్దిసేపటి ముందు శృంగారంలో పాల్గొనే ఆటగాళ్ల కథనాలు మనం చాలానే చూసి ఉంటాం. 1970లో లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ జార్జ్ బెస్ట్ ఇదే విధంగా చేసి.. ఆ సమయంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళ్తే.. 1993లో ఇజ్రాయిల్, స్వీడన్ మధ్య ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఇజ్రాయిల్ ఆటగాళ్లందరూ మ్యాచ్ ఫలితంపై దృష్టిపెడితే.. ఫెలిక్స్ హల్ఫోన్ మాత్రం వేరేదానిపై కాన్సంట్రేట్ చేశాడు. తన మేనేజర్ సూచనలను కూడా పక్కనపెట్టి.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే ఓ స్వీడిష్ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు.
ఈ సంగతి అప్పుడు మ్యాచ్ పూర్తికాగానే బయటకు రావడంతో.. ఆ తర్వాత ఫెలిక్స్.. ‘ఇది పెద్ద విషయమేమి కాదు. నేను ఎప్పుడూ నా సాక్స్‌లో ఒక కండోమ్‌ని ఉంచుకుంటాను’ అని బహిరంగంగా ప్రెస్ మీట్‌లో తెలిపాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఇజ్రాయిల్ జట్టు 5-0తో స్వీడన్‌పై విజయం సాధించింది. మాజీ ఇజ్రాయెల్ FA ప్రతినిధి షాల్ ఐసెన్‌బర్గ్ రాసిన పుస్తకంలో ఈ విషయం వెల్లడైంది. ఫుట్‌బాల్‌లో ఇలాంటివి కూడా జరుగుతున్నాయని అతడు తన పుస్తకంలో ప్రచురించడంతో.. షాల్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
కాగా, హల్ఫోన్ ఇజ్రాయిల్ తరపున 38 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకున్నాడు. ఇక ఆగష్టు 2003లో, అతడు టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అనంతరం నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాడు.(Source)