Flying Fish : నీటిలోనే కాదు బాస్..! గాల్లోనూ ఎగిరే సత్తా నాకుంది..! ఇలాంటి చేపల్ని ఎక్కడైనా చూశారా..?

|

Jan 03, 2025 | 9:03 PM

చేప ఒక జలచర జీవి. అయితే నీటిలో ఈదగల, గాలిలో ఎగరగలిగే చేపలను ఎప్పుడైనా చూశారా? అవును ..ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమేనండోయ్.. ఇలాంటి ఎగిరే చేపలు దాదాపు 200 మీటర్ల వరకు ఎగరగలవు. వాటికి ఇరువైపులా ఉన్న రెక్కలు వాటికి ఎగరడంలో సహాయపడతాయి. వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి అవి ఎగురుతాయి. ఈ వీడియో చూస్తే అవాక్కే..

Flying Fish : నీటిలోనే కాదు బాస్..! గాల్లోనూ ఎగిరే సత్తా నాకుంది..! ఇలాంటి చేపల్ని ఎక్కడైనా చూశారా..?
Flying Fish
Follow us on

నీటిలో ఈత కొట్టడంతో పాటు గాలిలో కూడా ఎగరగలిగే చేపలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, నీళ్లలో ఈదుతూ, అవసరం, ఆపద సమయంలో గాల్లో ఎగిరే చేపలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సమాచారం ప్రకారం, ఈ చేపలు 200 మీటర్ల వరకు మాత్రమే ఎగురుతాయి. ఈ చేపను గ్లైడర్ అంటారు. ఈ చేపలకు దాని శరీరానికి ఇరు వైపులా రెక్కలు ఉంటాయి. ఈ చేపలు ఈ రెక్కల సహాయంతో ఎగరగలవు.

సాధారణంగా ఈ చేపల పొడవు 17 నుంచి 30 సెంటీమీటర్లు. ఈ చేపలు సముద్రంలో తమపై దాడి చేయడానికి వచ్చిన జీవుల నుండి తప్పించుకోవడానికి అవసరమైనప్పుడు, అవి గాలిలో ఎగురుతాయి. అయితే, ఒక్కసారి నీటిలో నుంచి బయటికి రాగానే గాలిలోకి ఎగిరి మళ్లీ నీటిలోకి వస్తాయి. నీటి నుండి బయటకు వచ్చిన తర్వాత, ఈ చేపలు రెక్కలు విప్పుతాయి.

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ చేపలు మంచి గ్లైడర్లు. అయితే, నీటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఈ చేపలు ఎగరలేవు. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈ చేపను ప్రపంచవ్యాప్తంగా ‘ఫ్లయింగ్ ఫిష్’ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..