Viral Video: ఇలాంటి ప్రమాదాన్ని మునుపెన్నడూ చూసుండరు.. ఐదుగురిని బలిగొన్న అతివేగం

|

Aug 06, 2022 | 4:53 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ (Video Viral) అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని మాత్రం భయాందోళనకు గురి చేస్తాయి. ఓ కారు వేగంగా దూసుకొచ్చి మరికొన్ని కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటన దృశ్యాలు సోషల్...

Viral Video: ఇలాంటి ప్రమాదాన్ని మునుపెన్నడూ చూసుండరు.. ఐదుగురిని బలిగొన్న అతివేగం
Fire Accident In America
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ (Video Viral) అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని మాత్రం భయాందోళనకు గురి చేస్తాయి. ఓ కారు వేగంగా దూసుకొచ్చి మరికొన్ని కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోడ్డు ప్రమాదాలు చాలా భయంకరమైనవి. ప్రాణాలను తీసేయడమే కాకుండా, వారిపై ఆధారపడి ఉన్న వారిని రోడ్డున పడేస్తుంది. అందుకే రోడ్డు ప్రమాదాల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అవగాహన కల్పిస్తూ మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఓ రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన తీరు మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న మెర్సిడేస్‌ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ గర్భిణీతో పాటు ఏడాది వయసున్న చిన్నారితోపాటు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నికోల్‌ లింటన్‌ అనే 37 ఏళ్ల నర్సు మెర్సిడేస్‌ కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీ కొట్టిందని తెలిపారు. నర్సు నికోల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వెల్లడించారు. మృతి చెందిన మహిళ వైద్య పరీక్షలు కోసం తన భర్త, కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..