వామ్మో.. పగబట్టినట్టు పెళ్లి బృందంపై కందిరీగల దాడి .. వరుడు సహా 25 మందికి గాయాలు..

ఆలయ సందర్శనకు వెళ్లిన కుటుంబంపై ఒక్కసారిగా కందిరీగల దాడి జరిగింది. ఈ దాడిలో వరుడు నవీన్ సింగ్‌ సహా మొత్తం 25 మంది గాయపడ్డారు. ఎలాగోలా తప్పించుకున్న బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని నాడౌన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటనతో వివాహ వేడుకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

వామ్మో.. పగబట్టినట్టు పెళ్లి బృందంపై  కందిరీగల దాడి .. వరుడు సహా 25 మందికి గాయాలు..
Wasp Attack

Updated on: Apr 14, 2025 | 4:20 PM

గుడికి వెళ్లిన ఒక పెళ్లి బృందంపై కందిరీగలు దాడి చేశాయి. పెళ్లి తంతులో భాగంగా గుడికి వెళ్లిన వారిపై ఎట్నుంచి ఎటాక్‌ చేశాయో తెలియదు గానీ, ఒక్కసారిగా పెళ్లి బృందాన్ని చుట్టుముట్టేశాయి. పగబట్టినట్లుగా ఒకే ఫ్యామిలీలోని 25 మందిపై దాడి చేసిన కందిరీగలు విచ్చలవిడిగా కాటేశాయి. వీరిలో పెళ్లి కూడా ఉన్నాడు. కందిరీగల దాడిలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రక్కడ్ గ్రామంలో పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా వరుడు సహా కుటుంబ సభ్యులు గుడికి వెళ్లార.. సమీపంలోని గూగా ఆలయ సందర్శనకు వెళ్లిన కుటుంబంపై ఒక్కసారిగా కందిరీగల దాడి జరిగింది. ఈ దాడిలో వరుడు నవీన్ సింగ్‌ సహా మొత్తం 25 మంది గాయపడ్డారు.

ఎలాగోలా తప్పించుకున్న బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని నాడౌన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటనతో వివాహ వేడుకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..