Viral Photo: ఈ ఫోటోలోని రాయి గాలిలో ఉందా..? నీటిలో ఉందా.? మీలో ఎంత దమ్ముందో చూసేద్దామా.!

ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో జనాలు ఎప్పుడూ ఇలాంటి వాటిని సాల్వ్ చేసేందుకు..

Viral Photo: ఈ ఫోటోలోని రాయి గాలిలో ఉందా..? నీటిలో ఉందా.? మీలో ఎంత దమ్ముందో చూసేద్దామా.!
Viral Photo

Edited By:

Updated on: Jun 07, 2023 | 2:00 PM

ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో జనాలు ఎప్పుడూ ఇలాంటి వాటిని సాల్వ్ చేసేందుకు యాక్టివ్‌గా ఉంటారు. ఆయా ఫోటోల్లోని చిక్కుముడులను విప్పేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం, విద్యార్థులకు జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఈ ఫోటో పజిల్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఈజీగా సాల్వ్ చేయొచ్చునని అనుకోవద్దు. మీ మెదడును మాత్రమే కాదు.. కళ్లను కూడా మభ్యపెడుతుంటాయి. వాటిలో మనకు తెలియని ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది.

నిశితంగా చూస్తే కానీ అందులో ఉన్న రహస్యం బయటపడదు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫోటో ఒకటి బాగా వైరలవుతోంది. ఈ వైరల్ ఫోటోలో ఓ బండరాయి మీకు కనిపిస్తుంది. దానికి దగ్గరలో నేల లాంటి ప్రదేశాన్ని మీరు చూడవచ్చు. ఇంతకీ ఇక్కడ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే.. ఇంతకీ ఆ బండరాయి గాల్లో తేలుతోందా.? లేక నీటిలో తేలుతోందా.? ఆలోచించండి.. కాస్త మీ బుర్రకు పదునుపెట్టండి.. తొందరేం లేదు.. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి… మీకూ తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి.