
ఆప్టికల్ ఇల్యూషన్ కు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో నిత్యం వందల కొద్దీ వైరల్ అవుతూ ఉంటాయి. మనకు కావాల్సింది కళ్ల ముందే ఉన్న అది మనకు కనిపించదు.. మన కళ్లు మనల్ని ఇంత మోసం చేస్తాయా.? అనిపిస్తుంది ఒకొక్కసారి అలాంటివి చూస్తే.. తాజాగా అలంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని ఫొటోలో దాగిఉన్న జంతువులను కనిపెట్టడం చాలా కష్టం.. పై ఫోటో కూడా అలాంటిదే..ఈ చిత్రంలో మీరు చెట్లలో దాక్కున్న ఒక జంతువును కనిపెట్టాలి. చూడటానికి అంతా నార్మల్ గానే ఉన్న అక్కడ ఒక జంతువు ఉంది. అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆర్ట్ వోల్ఫ్ తీసిన ఫోటోల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో మీరు చాలా చెట్లు , ఎండిపోయిన గడ్డితో కూడిన అటవీని చూడొచ్చు.
ఇప్పుడు మీరు ఈ చిత్రంలో 11 సెకన్లలో అడవిలో ఉన్న తోడేలును కనుగొనవలసి ఉంటుంది. ఈ రకమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ మీ మెదడును పదును చేస్తుంది. ఫోటో చాలా క్లిష్టంగా ఉంది, వెంటనే తోడేలును చూడటం కొంచెం కష్టం, మీరు జాగ్రత్తగా చూస్తే, ఇది ఖచ్చితంగా సాధ్యమే. చాలా మంది ఈ ఛాలెంజ్ లో ఓడిపోయారు. ఆ తోడేలును కనిపెట్టలేక పోయారు. ఇక చేసేదేమి లేక కింద ఉన్న ఆన్సర్ చేసేశారు.. మీరూ చూడాలనుకుంటే ఆ ఫోటో కింద ఉంది చూడండి.
Wolf