
Viral Photo: నెట్టింట రకరకాల వీడియోలు చూసి ఎంజాయ్ చేసే వారు చాలామంది ఉంటారు. కానీ కొందరు మాత్రం కాస్త టిపికల్ కంటెంట్ సెర్చ్ చేస్తారు. ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారు పజిల్స్ బాగా లైక్ చేస్తారు. ఈ మధ్య పజిల్స్ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రజంట్ ఫోటో పజిల్స్(Photo Puzzles) ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.‘ఈ ఫోటోలో పాము దాగి ఉంది.. ఎక్కడో కనిపెట్టండి’, ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగి ఉన్నాయి’.. లాంటివి మీ కంట పడే ఉంటాయి. మీ ఐ పవర్ ఎంతో తెలుసుకోడానికి ఈ ఫోటో పజిల్స్ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి మీ మెదడుకు మేతగా కూడా ఉపయోగపడతాయి. సదరు ఫోటోలో ఏముందో కనిపెట్టేవరకు కొంతమంది విశ్రమించరు. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓసారి పైన ఫోటోను జాగ్రత్తగా గమనించండి. దాంట్లో ఓ పందికొక్కు దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అది అంత సులభం అయితే కాదు. అక్కడున్న కట్టెల రంగు.. ఆ పందికొక్కు రంగు ఒక్కటే అవ్వడం వల్ల.. దాన్ని కనిపెట్టడం చాలా పెద్ద టాస్కే. ఇదొక చక్కటి బ్రెయిన్ టీజర్.. మీ ఐ పవర్ ఫెంటాస్టిక్‌గా ఉన్నట్లయితే ఈజీగా కనిపెట్టొచ్చు. లేదంటే మనతో ఆ పజిల్ ఆడేసుకుంటుంది. చాలా తికమకగా ఉంటుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక చేతులెత్తేశారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. కనిపెడితే మీరు గ్రేటే. ఎంతసేపు చూసినా వీడని చిక్కుముడిలా ఉంటే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..