కేవలం పది రూపాయలు విలువ చేసే జిలేబీ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కిందా మీదా పడి కొట్టుకున్నారు. పది రూపాయల జిలేబీ కోసం దుకాణదారుడు, కస్టమర్‌కు మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వీరి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం పోలీసుల వరకూ చేరింది. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది.
గ్వాలియర్‌లోని మురార్ పోలీస్ స్టేషన్‌లోని బారాదరి కూడలిలో ఓ వ్యక్తి దుకాణం ఒకటి అద్దెకు తీసుకుని టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత రాత్రి దుకాణానికి స్నాక్స్ కోసం వచ్చిన కస్టమర్ రవి శ్రీవాస్ అతని అనుచరులు రూ. 10లకు జిలేబీ కావాలని అడిగారు. అందుకు దుకాణదారుడు నిరాకరించాడు. పది రూపాయలకు జిలేబీ రాదని చెప్పాడు. అందుకు ఆగ్రహించిన కస్టమర్ రవి శ్రీవాస్, అతనితో పాటు వచ్చిన ఇతర వ్యక్తులు దుకాణ దారుడితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే వీరి గొడవను గమనించిన షాపు యజమాని.. నిరంజన్ గుర్జార్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కస్టమర్ రవి శ్రీవాస్, అతని అనుచరులు షాప్ యజమాని నిరంజన్ గుర్జార్‌తో గొడవకు దిగారు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పరస్పరం కలబడి కొట్టుకునే వరకు వెళ్లింది. చాలా సేపు సాగిన వీరి ఫైట్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడ జనం గుమిగూడారు.
ఈ వీడియో చూడండి..
ग्वालियर
⏭️10 रुपए की जलेबी के पीछे विवाद
⏭️ग्राहक और दुकानदार में मारपीट
⏭️मुरार थाना के बारादरी चौराहे की घटना
⏭️नाश्ते की दुकान पर हुआ जमकर विवाद
⏭️10 रुपए की जलेबी के लिए ग्राहक ने दुकानदार से विवाद किया#gwalior | @GwaliorComm | @MPPoliceDeptt | pic.twitter.com/743HptT85D— Samachar News India (@SamacharNewsIND) September 14, 2024
ఈ గొడవతో ఇరువర్గాలు మురార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు క్రాస్ కేసు నమోదు చేశారు. కాగా, ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..