తాజ్‌మహల్ వద్ద జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ డ్యాన్స్.. భలే ఎంజాయ్ చేస్తున్నావు బ్రో అంటున్న నెటిజన్లు..

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చిన్న క్లిప్‌లో నోయెల్ రాబిన్సన్ నిజంగా భారతీయ సంస్కృతిని స్వీకరించాడు. జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తెల్లటి పైజామా, మెరూన్ కుర్తా ధరించి తాజ్ మహల్ వద్ద సందడి చేశాడు. అంతేకాదు కుల్దీప్ మనక్ రాసిన "జింద్ కాధ్ కే" అనే ఉల్లాసభరితమైన పాటకు గ్రూవ్ చేస్తూ కనిపించాడు. అతని డ్యాన్స్ చేసిన విధానం చాలా మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

తాజ్‌మహల్ వద్ద జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ డ్యాన్స్.. భలే ఎంజాయ్ చేస్తున్నావు బ్రో అంటున్న నెటిజన్లు..
German Influencers

Updated on: May 28, 2024 | 2:07 PM

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్దిగాంచిన తాజ్ మహల్ ను సుప్రసిద్ధ జర్మన్ టిక్‌టోకర్ నోయెల్ రాబిన్సన్ సందర్శించాడు. అంతేకాదు అందాల తాజ్ మహల్ ముందు అద్భుతమైన నృత్య నైపుణ్యాలతో డ్యాన్స్ చేశాడు. ఐకానిక్ తాజ్ మహల్ వెలుపల తీసిన ఈ డ్యాన్స్ వీడియో వీడియో వైరల్‌గా మారింది. అనేక మంది నుంచి ప్రశంసలు అందుకుంది. ఇది మాత్రమే కాదు నోయెల్ రాబిన్సన్ పోలీసు అధికారి అమోల్ కాంబ్లేతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో, వీధుల్లో పిల్లలతో డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలతో చాలా మంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చిన్న క్లిప్‌లో నోయెల్ రాబిన్సన్ నిజంగా భారతీయ సంస్కృతిని స్వీకరించి భాతీయుడిలా కనిపించేలా దుస్తులను ధరించాడు. జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తెల్లటి పైజామా, మెరూన్ కుర్తా ధరించి తాజ్ మహల్ వద్ద సందడి చేశాడు. అంతేకాదు కుల్దీప్ మనక్ రాసిన “జింద్ కాధ్ కే” అనే ఉల్లాసభరితమైన పాటకు గ్రూవ్ చేస్తూ కనిపించాడు. అతని డ్యాన్స్ చేసిన విధానం చాలా మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.  నువ్వు సూపర్ బ్రో అంటూ నెటిజన్లు  అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నాలుగు లక్షలకు పైగా లైక్స్ ను, ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. బ్రో.. నువ్వు భారత్ లో భలే ఎంజాయ్ చేస్తువు అని ఒక యూజర్ కామెంట్ చేయగా మరొకరు “హ్యాపీడెంట్ వైట్ యాడ్ బాయ్ లాగా ఉన్నాడని కామెంట్ చేశాడు. మీరు ఆ భారతీయ దుస్తులలో చాలా అందంగా ఉన్నారు అని కామెంట్ చేయగా.. అతనికి మన దేశం గుర్తింపు కారు అయిన  ఆధార్ కార్డు పొందాలి” అని మరొకరు కామెంట్ చేశారు.

బ్రో కెరీర్ మొత్తం ఈ పాటపై మాత్రమే ఆధారపడి ఉంది.. అని కామెంట్ చేయగా.. బ్రో ఇండియాను సందర్శించారు కనుక అన్న ఇక అధికారికంగా భారతీయుడు” అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.  మీరు ప్రపంచానికి చాలా అవసరమైన ఆనందాన్ని అందిస్తున్నారు నువ్వు అంటే ఇష్టమని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..