నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేను.. సూసైడ్‌ లెటర్‌లో డాక్టర్‌ పేరు రాసి యువకుడి ఆత్మహత్య కలకలం..

|

Nov 09, 2022 | 9:20 AM

జుట్టు రాలిపోయే సమస్యతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. చాలా కాలంగా మందులు వాడుతున్నప్పటికీ జుట్టు రాలే సమస్య తగ్గటం లేదనే మనస్తాపంతో యువకుడు ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఈ ఘటనలో సదరు డాక్టర్..

నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేను.. సూసైడ్‌ లెటర్‌లో డాక్టర్‌ పేరు రాసి యువకుడి ఆత్మహత్య కలకలం..
Youth Hangs Himself
Follow us on

జుట్టు రాలే సమస్య చాలా మందికి సాధారణ సమస్య. ఇటీవలి కాలంలో యువతలో ఈ సమస్య మరింతగా పెరుగుతోంది. ఎన్ని మందులు, చికిత్సలు తీసుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేరళలోని కోజిక్‌ కోడ్‌లో జుట్టు రాలిపోయే సమస్యతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. సాలినేరి సమీపంలోని ప్రభాకరన్‌ కుమారుడు ప్రశాంత్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలా కాలంగా మందులు వాడుతున్నప్పటికీ, కనుబొమ్మలు, శరీరంలోని ఇతర భాగాలపై వెంట్రుకలు రాలిపోతున్నాయనే మనస్తాపంతో కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణాలపై సూసైడ్‌ లెటర్‌ రాసిపెట్టాడు. తనకు చికిత్స చేసిన వైద్యుడిని తప్పుబడుతూ సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. కోజికోడ్‌కు చెందిన తన ఇంట్లోనే ప్రశాంత్‌ శవమై కనిపించాడు.

జుట్టు రాలిపోవడానికి వైద్యం అందించిన వైద్యుడే తన చావుకు కారణమని ప్రశాంత్ తన లేఖలో పేర్కొన్నాడు.. ఈ సమస్యతో ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నానని లేఖలో ప్రస్తావించాడు. జుట్టు రాలిపోతుందనే సమస్యతో 2014 నుంచి సదరు డాక్టర్‌ వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. డాక్టర్ చెప్పిన మాత్రలు వేసుకున్నా కనుబొమ్మలు, ముక్కు వెంట్రుకలు రాలిపోయాయి. జుట్టు రాలడం ఆగిపోతుందన్న ఆశతో 2020 వరకు అంటే 6 ఏళ్ల పాటు మందులు వాడినట్లు తెలిసింది.

కానీ చికిత్స తీసుకున్నప్పటికీ, అతని కనుబొమ్మలపై వెంట్రుకలు కూడా తగ్గుతున్నాయి. దీంతో తనను ఎవరూ పెళ్లి చేసుకోవటం లేదని ఆందోళనలోపడ్డాడు.. ఈ నేపథ్యంలోనే విసిగిపోయి జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ఆత్మహత్యకు పాల్పడిన ప్రశాంత్ అనే యువకుడు తన డెత్ నోట్ లో రాశాడు.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్‌కు చికిత్స అందించిన వైద్యుడు రఫీక్‌పై అథోలి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే పేరంబ్రా ఏఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఎలాంటి నేరం జరగలేదని, తదుపరి విచారణ జరుపుతున్నామని అథోలి ఎస్‌ఐ తెలిపారు. అలాగే డాక్టర్‌ని విచారించామని, అయితే నిందితుడిగా పరిగణించలేదని చెప్పారు. అలాగే పోస్టుమార్టం నివేదిక కోసం కూడా ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి