భూమిపై వందలాది జాతుల జంతువులు ఉన్నప్పటికీ.. వాటిల్లో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి. సింహం, పులి, చిరుత, హైనా.. లాంటివి ఈ జాబితాలోకి వస్తాయి. ఇక నీటిలో నివసించే జంతువుల గురించి మాట్లాడితే.. అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది అని అనుకుంటే.. మొసళ్లు మొదట గుర్తొస్తాయి. వీటిని ‘సముద్రపు అలెగ్జాండర్స్’ అని పిలుస్తారు. నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. తనకంటే భారీగా ఉండే జంతువు దేనినైనా సరే.. క్షణాల్లో మట్టుబడుతుంది. ఇతర జంతువులే మొసళ్లతో తలబడలేవు. అలాంటిది మనిషి.. మొసళ్ళతో తలబడగలడా.? తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవ్వడం ఖాయం.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి తన చుట్టూ ఉన్న మొసళ్లకు ఫుడ్ పెడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఆ ప్రదేశమంతటా మొసళ్లు నిండి ఉన్నాయి. ఆమె ఎక్కడా కూడా భయపడకుండా.. చిన్న పిల్లలకు ఫుడ్ పెడుతున్నట్లు జాలీగా పెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.
కాగా, ఈ వీడియోను ‘Zane_Shapiro’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ‘నీ ధైర్యం ఏంది తల్లి! సలాం’ అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.