Viral Post: చెత్తలో దొరికిన 62 ఏళ్ల క్రితం నాటి తండ్రి పాస్‌బుక్.. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించిన కొడుకు..

సాధారణంగా ఇంటి క్లీనింగ్‌ పనులు చేస్తుండగా, అక్కడక్కడ మనం ఎప్పుడో పెట్టి మర్చిపోయిన డబ్బులు, వస్తువులు దొరుకుతుంటాయి. అలా వందలు, వేల రూపాయలు దొరికితేనే మనం ఎంతగానో సంతోషపడుతుంటాం. కానీ, ఇంటిని శుభ్రం చేస్తూ ఒక్క రోజులోనే మీమ్మల్నీ కోటీశ్వరులను చేసేది ఏదైనా దొరుకుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా..? ఇది ఒక కలలా అనిపిస్తుంది కదా..? కానీ, ఒక వ్యక్తికి ఇదంతా నిజంగానే జరిగింది. ఆ పూర్తి కథేంటో ఇక్కడ చూద్దాం..

Viral Post: చెత్తలో దొరికిన 62 ఏళ్ల క్రితం నాటి తండ్రి పాస్‌బుక్.. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించిన కొడుకు..
From Trash To Treasure

Updated on: Dec 17, 2025 | 4:20 PM

సోషల్ మీడియాలో తరచూ చాలా విషయాలు వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి ప్రజల అదృష్టం ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పే విషయాలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. కొన్నిసార్లు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు మీరు పోగొట్టుకున్న విలువైన వస్తువు లేదా డబ్బు తిరిగి కనిపిస్తుంది. దాంతో అంతవరకు మీరు పడ్డ శ్రమ వల్ల కలిగే అలసట మొత్తం ఒక్క నిమిషంలో మాయమవుతుంది. సరిగ్గా అలాంటి అద్భుతమే ఒక వ్యక్తి విషయంలోనూ జరిగింది. ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన ఒక వస్తువు అతన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది.

ఆక్సెల్ హినోజోసా అనే చిలీ వ్యక్తి తన దివంగత తండ్రి 62 ఏళ్ల బ్యాంకు పాస్‌బుక్‌ను చెత్తబుట్టలో గుర్తించాడు. ఆ తర్వాత అదృష్టం అతన్ని వెంటాడింది. ఆ వ్యక్తి పాస్‌బుక్ ఆధారంగా తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు కోసం కోర్టును ఆశ్రయించాడు.

పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ ఎంత ఉంది?

సమాచారం ప్రకారం, యాక్సెల్ హినోజోసా తండ్రి 1960-70లలో ఇల్లు కొనడానికి రూ.1.4 లక్షలు (140,000 INR) బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. దాదాపు 60 సంవత్సరాల క్రితం, రూ.1.4 లక్షలు (140,000 INR) అనేది చిన్న మొత్తం కాదు. యాక్సెల్ హినోజోసా తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. అయితే, ఇప్పుడు ఇళ్లంతా క్లీన్‌ చేస్తుండగా, చెత్తలో అతని తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది. కానీ, ఆ బ్యాంక్ మూసివేయబడింది. అంతేకాదు.. ఆ పాస్‌బుక్‌లో కుటుంబ సభ్యుల పేర్లు ఏవీ ప్రస్తావించలేదు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా నిరాశకు లోనైంది. కానీ, ఇక్కడే అతని అదృష్టాన్ని మార్చివేసే ఒక కీలక మెసేజ్‌ కనిపించింది. పాస్‌బుక్‌లో రాసివున్న ఒక నోట్‌ ఆధారంగా హినోజోసా కోర్టును ఆశ్రయించాడు. న్యాయపోరాటం ద్వారా తన తండ్రి పొదుపు చేసిన డబ్బును తిరిగి పొందాలని నిశ్చయించుకున్నాడు.

పాస్‌బుక్‌లో ఏం రాసి ఉంది?

సదరు బ్యాంక్ మూసి ఉన్నప్పటికీ, హినోజోసా పాస్‌బుక్‌పై స్టేట్ గ్యారెంటీ అని రాసి ఉండటం అతడు గమనించాడు. దీని అర్థం బ్యాంక్ దివాలా తీసినా లేదా బ్యాంక్‌ మూసేసినా కూడా ప్రభుత్వం చెల్లింపు చేస్తుంది. ఇది చదివిన హినోజోసా ముఖంలో తిరిగి చిరునవ్వు వచ్చింది. అతను తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందడానికి ప్రయత్నించాడు. చివరకు, కోర్టు హినోజోసాను తన తండ్రి డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దాదాపు 62 సంవత్సరాల క్రితం నాటి ఆ 1.4 లక్షల రూపాయలు నేడు దాదాపు 9 కోట్ల రూపాయలు అయ్యాయి. ఆ విధంగా చెత్తలో దొరికిన పాస్‌బుక్ ఈ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మార్చివేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..