వెల్లుల్లి తొక్క తీయడం ఇబ్బందిగా ఉందా.. ముఖ్యంగా పచ్చళ్లు పెట్టేప్పుడు.. ఎక్కువమందికి వంటకాలు చేసేటప్పుడు.. వెల్లుల్లి తొక్క తీసేందుకు చాలా సమయం పడుతుంది. అయితే ఈ ట్రిక్ పాటిస్తే మీ పని సులువు అవుతుంది. ఈ కిచెన్ హ్యాక్ వీడియో చూస్తే మీరు కంగుతినాల్సిందే. ఈ వీడియోలో చూపిన వెల్లుల్లి ఒలిచే విధానం ఖచ్చితంగా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. కిచెన్‌లో ఎక్కువగా కష్టపడాల్సిన అవరంస ఉండదు. ఈ వీడియోను చూసిన తర్వాత.. ఎంత వెల్లుల్లి ఉన్నా సరే.. నిమిషాల్లో చాలా సులభంగా తొక్కగలరు. ఒక మహిళ క్లిప్పర్ సహాయంతో క్షణాల్లో వెల్లుల్లి తొక్క ఎలా తీసిందో ఈ వీడియో మీరు చూడవచ్చు.
వీడియో దిగువన చూడండి….
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @kendall.s.murray అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. “ఆ తొక్కు తీసే ఇబ్బంది పడలేక.. నేను చాలాకాలంగా వంటల్లో వెల్లుల్లి వాడటమే మానేశాను. అయితే ఈ మధ్యనే దాని తోలు తీసే నింజా టెక్నిక్ నేర్చుకున్నాను. ఈ ట్రిక్ నాకు ముందే ఎందుకు చెప్పలేదో తెలియట్లే. ఈ క్రేజీ హ్యాక్ ఇంకా ఎవరు మిస్ అవతున్నారు” అని.. ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
అయితే, కొంతమంది నెటిజన్స్ భారతీయ వెల్లుల్లి షేప్ అండ్ సైజ్ విభిన్నంగా ఉంటుందని.., ఈ ట్రిక్ అంతగా పనిచేయకపోవచ్చని కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ, ఈ హ్యాక్ ఫాలో అయితే మీరు చాలా సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వైరల్ హ్యాక్ వీడియోకు ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వీడియోపై మీ ఒపెనియన్ కూడా తెలియచేయండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..