Farmer Kills Tiger : ఆవును చంపి తినేసిన పులి.. పగతో రగిలిపోయిన రైతు ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

| Edited By: Jyothi Gadda

Sep 12, 2023 | 6:27 PM

అటవీ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాలున్న పులి , మూడు సంవత్సరాలున్న పులి మృతి చెందాయి.. రోజుల వ్యవధిలోనే పులులు మృతి చెందాయి. మొదట ఈ నెల 2 న పెద్దపులి మృతి చెందిన విషయం అటవీశాఖ అదుకారులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. అయితే ఆ సమాచారం ఆలస్యంగా అందింది..

Farmer Kills Tiger : ఆవును చంపి తినేసిన పులి.. పగతో రగిలిపోయిన రైతు ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..
Farmer Kills Tiger
Follow us on

నీలగిరి జిల్లాలో పులికి విషం ఇచ్చి చంపిన రైతును తమిళనాడు అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. శేఖర్ అనే రైతు ఆవులు, మేకలను పెంచుతున్నాడు. సెప్టెంబర్ 9, శనివారం నీలగిరిలోని అవలాంచి డ్యామ్ సమీపంలో మూడు, ఎనిమిది సంవత్సరాల వయస్సు గల రెండు పులుల మృతదేహాలను డిపార్ట్‌మెంట్ గుర్తించింది. అటవీశాఖ అధికారులు విచారణ ప్రారంభించి పులులకు పోస్టుమార్టం నిర్వహించారు. అందులో పులులు పురుగుమందు తాగి చనిపోయినట్టుగా నిర్ధారణ అయ్యింది. చనిపోయిన పులుల పక్కన ఆవు కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు.. నీలగిరి అటవీ విభాగం మరణాలపై విచారణకు 20 మంది అటవీ సిబ్బంది బృందాన్ని ఏర్పాటు చేసి కేసును చేధించారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో వరుసగా రెండు పులులు మృత్యువాత పడ్డాయి. అవలాంజీ అటవీ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాలున్న పులి , మూడు సంవత్సరాలున్న పులి మృతి చెందాయి.. రోజుల వ్యవధిలోనే పులులు మృతి చెందాయి. మొదట ఈ నెల 2 న పెద్దపులి మృతి చెందిన విషయం అటవీశాఖ అదుకారులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. అయితే ఆ సమాచారం ఆలస్యంగా అందింది..

అప్పటికే చనిపోయిన పులి కళేబరం కుళ్ళిన ఆనవాళ్లు ఉన్నాయి.. వెంటనే పులి మృతిపై కారణాల్లో ఒక అంచనాకు రాలేక పోయారు అటవీశాఖ అధికారులు. ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం మరో పులి చనిపోయిన విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు స్థానికులు. అటవీశాఖ అధికారులు దీనిపై సీరియస్ ఫోకస్ పెట్టారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు ఆ ప్రాంతంలో విచారణ మొదలుపెట్టారు. వేటగాళ్ల పని అన్న అనుమానంతో ఆ ప్రాంతాల్లో కొత్తవారి సంచారం ఉందా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మరోవైపు చనిపోయిన పులులకు పోస్టుమార్టం నిర్వహించగా ఆ రిపోర్ట్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

పులుల మృతికి కారణం కడుపులో విషం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.. మరోవైపు పోలీసుల విచారణలో ఓ వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.. అతని వద్ద లభించిన గుర్తుతెలియని పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టైల్ లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. అతని పేరు శేఖర్ అని,  అదే ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తికి ఆవులు ఉన్నాయని  తెలిసింది.

పులులు చనిపోవడానికి నెల క్రితం తన ఆవును పులి దాడి చేసి తినేసింది. తన ఆవుని చంపిందని దానికి ప్రతీకారంగానే పులులకు విషం పెట్టి చంపినట్టు పోలీస్ విచారణ లో వెల్లడించాడు. పులుల మృతి ఫై అనుమానం తో విచారణ చేపట్టిన అటవీ శాఖ అధికారుల, పోలిసుల విచారణ లో పులులు మృతి చెందడానికి విష ప్రయోగం కారణమని నిర్ధారణ అయ్యింది. అది తానే చేసినట్లు అంగీకరించడంతో విషయం తెలిసిన స్థానికులతో పాటు అధికారులు కూడా అవాక్కయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి ఆవు యజమాని శేఖర్ ని అరెస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..