వచ్చేశాం… మీ కోసం ఓ కిర్రాక్ నంబర్ పజిల్ తెచ్చాం.. ఓ విజిల్ వేసుకోండి. ప్రజంట్ సోషల్ మీడియాను మీమ్స్ ఏ రేంజ్లో ఊపేస్తున్నాయో.. ఇంచు మించు అదే లెవల్లో ఆప్టికల్ ఇల్యుషన్ పజిల్స్ సైతం వైరల్ అవుతున్నాయి. ఇవి అలాంటి ఇలాంటి పజిల్స్ కాదండోయ్. మిమ్మిల్ని మాయ చేస్తాయి. మీ కళ్లతో గేమ్ ఆడుకుంటాయి. బుర్రను బాగా హీటెక్కిస్తాయి. ఎంత సేపు వెతికినా సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలు ఇవి. పద సంపత్తికి సంబంధించిన పజిల్స్ అయితే కాసేపు బాగా ఆలోచించి.. ఓ కన్‌క్లూజన్‌కు రావొచ్చు. కానీ ఈ నంబర్స్ కునుక్కోవడం వంటివి ఉంటాయి చూశారా.. వీటితో సరదా తీరిపోతుంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా ఉండి.. మనల్ని ఓ పట్టు పట్టేస్తాయి. అలాంటి ఓ కిక్కిచ్చే పజిల్ తెచ్చాం…
పైన ఉన్న జిగ్‌జాగ్ ఫోటో చూశారా..? తెలుపు, నలుపు గీతలతో కూడిన సర్కిల్స్ కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా..! గీతల మధ్యలో కొన్ని నంబర్స్ ఉన్నాయ్ అవేంటో మీరు చెప్పాలి. సర్కిల్లో మొదట ‘528’ని నంబర్స్ ఈజీగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి సెంటర్లో ఉన్నాయి కాబట్టి. నిశితంగా పరిశీలిస్తే సర్కిల్లో మరిన్ని నంబర్స్ గుర్తించవచ్చు. ఇప్పుడు ‘45283’ నంబర్స్ కనిపెట్టిన వాళ్లు కూడా ఉండి ఉండొచ్చు. అక్కడ ఇంకా నంబర్స్ ఉన్నాయండి.. బాగా పరీక్షగా చూడండి. ఆ గీతల మధ్యన దాగి ఉండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
ఏంటి ఆన్సర్ కనిపెట్టేశారా..? అయితే ఫైన్.. కనిపెట్టనివాళ్లు ఓ వర్రీ అవ్వకండి ఆన్సర్ ఎంతో మేము చెప్పబోతున్నాం. ఈసారి ఇలాంటి నంబర్ పజిల్ ఇచ్చినప్పుడు ఇంకాస్త్ ఫోకస్ పెట్టి దాని అంతు తేల్చండి. మావేం బట్టి బుర్రలు కాదు.. బోలెడంత స్టఫ్ ఉందని చాటిచెప్పండి. అసలు అన్సర్ ఏంటంటే.. 3452839.
DO you see a number?
If so, what number? pic.twitter.com/wUK0HBXQZF
— Benonwine (@benonwine) February 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..