Viral Video: రాంగ్ రూట్‌లో వచ్చి రుబాబు.. తిక్క కుదర్చిన సైనికుడు.. వీడియో వైరల్

వాహన డ్రైవింగ్ సమయంలో మనం సరిగ్గానే వెళ్తున్నా ఎదుటివారు రాంగ్ రూట్‌లో వచ్చి మరీ రుబాబు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వెళ్లే పని టెన్షన్ వల్లనో.. లేకపోతే మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చాలా మంది అలాంటి వారితో వాదనకు దిగరు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో మనం వాదనకు దిగినా చుట్టుపక్కల వారు మనల్ని వింతగా చూస్తూ ఉంటారు.

Viral Video: రాంగ్ రూట్‌లో వచ్చి రుబాబు.. తిక్క కుదర్చిన సైనికుడు.. వీడియో వైరల్
Viral Video

Updated on: Aug 28, 2024 | 4:00 PM

వాహన డ్రైవింగ్ సమయంలో మనం సరిగ్గానే వెళ్తున్నా ఎదుటివారు రాంగ్ రూట్‌లో వచ్చి మరీ రుబాబు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వెళ్లే పని టెన్షన్ వల్లనో.. లేకపోతే మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చాలా మంది అలాంటి వారితో వాదనకు దిగరు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో మనం వాదనకు దిగినా చుట్టుపక్కల వారు మనల్ని వింతగా చూస్తూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం రాంగ్ రూట్‌లో వచ్చిన వారి తిక్క కుదురుస్తూ ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వ్యక్తికి సైనికాధికారి తిక్క కుదిర్చాడు. ఆ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వైరల్ అవుతున్న వీడియోను కారులో ప్రయాణించే వ్యక్తి తీశాడు. ఆ కారుకు అడ్డుగా రాంగ్ రూట్‌లో ఓ వ్యక్తి ఈవీ స్కూటర్‌పై వచ్చాడు. పైగా పక్క నుంచి వెళ్లమంటూ సైగ చేస్తూ బండిని కారుకు అడ్డంగా నిలిపాడు. ఈ క్రమంలో పక్క రోడ్‌లో ఉన్న ఆర్మీ సైనికులను తీసుకెళ్లే వాహన డ్రైవర్ కిందకు ఈవీ స్కూటర్‌పై ఉన్న వ్యక్తి హెల్మెట్‌పై కొట్టాడు. అనంతరం తప్పు నీదేనంటూ చెబుతున్నా ఆ వ్యక్తి వాదనకు దిగడంతో వ్యాన్‌లో నుంచి కర్ర తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నాడు.

ఇవి కూడా చదవండి


అయితే ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంత మంది ఆర్మీ అధికారి చర్యలను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం పౌరులను కొట్టే హక్కు ఎవరు ఇచ్చారంటూ ఆర్మీ అధికారి తీరుపై మండిపడుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..