30వేల అడుగుల ఎత్తులో విమానం.. మద్యం మత్తులో తాగుబోతు బీభత్సం..! ఆ తర్వాత ఏం జరిగిదంటే..

|

Sep 08, 2024 | 12:25 PM

తాగిన మైకంలో కొందరు కాలు తీసి కనీసం చెప్పులు కూడా వేసుకోలేకపోతుంటారు. అలాగే మరికొందరు తాగిన మైకలంలో కరెంట్‌ పోల్లు, సెల్‌ టవర్లు ఎక్కేస్తుంటారు. అలాంటి ఘటనే ఓ విమానంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు 30 వేల అడుగుల ఎత్తులో బీభత్సం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

30వేల అడుగుల ఎత్తులో విమానం.. మద్యం మత్తులో తాగుబోతు బీభత్సం..! ఆ తర్వాత ఏం జరిగిదంటే..
Easyjet Passenger
Follow us on

మద్యం మత్తులో కొందరు వ్యక్తులు చేసే వింత పనులు మీరు తరచుగా వినే ఉంటారు. కొందరు చూట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపిస్తే, మరికొందరు రచ్చ సృష్టిస్తుంటారు. కొందరు వ్యక్తులు డ్రైవింగ్ చేయలేక అవస్థలు పడుతుంటారు. మరికొందరు కాలు తీసి కనీసం చెప్పులు కూడా వేసుకోలేకపోతుంటారు. అలాగే మరికొందరు తాగిన మైకలంలో కరెంట్‌ పోల్లు, సెల్‌ టవర్లు ఎక్కేస్తుంటారు. అలాంటి ఘటనే ఓ విమానంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు 30 వేల అడుగుల ఎత్తులో బీభత్సం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియో లండన్‌కు సంబంధించినదిగా తెలిసింది. లండన్‌ నుంచి బయలుదేరిన ఈజీజెట్ విమానం U28235 గ్రీస్‌లోని కోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 గంటల్లో చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం 30 వేల అడుగుల ఎత్తుకు చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. అతను కూడా కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఫ్లైట్ కెప్టెన్‌ని నువ్వు పనికిరానివాడివి అంటూ., తన సీటుపై నిలబడి పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగింది.

ఇవి కూడా చదవండి

ఫ్లైట్‌ సిబ్బంది అతనిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే అతను వారిని నోటికి వచ్చినట్టుగా తింటటం ప్రారంభించాడు. గొడవ ప్రారంభించాడు. తాగుబోతు చేష్టలతో విసుగెత్తిపోయిన కొందరు ప్రయాణికులు అతడిని అదుపు చేసి పోలీసులు వచ్చే వరకు పట్టుకున్నారు. ఫ్లైట్‌లో తాగుబోతు తీవ్ర గందరగోళం సృష్టించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకుని మ్యూనిచ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. జర్మన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు.

ఈ వీడియో చూడండి..

తెలిసిన వివరాల ప్రకారం, విమానం టేకాఫ్ అయిన 1 గంట 44 నిమిషాలకు అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. నిందితుడిని పోలీసులు తీసుకెళ్తుండగా.. ప్రయాణికులు ఆనందంతో అరుస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..