Elon Musk: ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు ఒక్కరేనా.. వైరల్ అయిన ఫొటో..

|

Dec 28, 2021 | 3:56 PM

స్పేస్‌ఎక్స్, టెస్లా CEO ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతను దాదాపు ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే వ్యాపారవేత్త.

Elon Musk: ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు ఒక్కరేనా.. వైరల్ అయిన ఫొటో..
Musk
Follow us on

స్పేస్‌ఎక్స్, టెస్లా CEO ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతను దాదాపు ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే వ్యాపారవేత్త. అయితే అతనిలాగే ఉన్న డోపెల్‌ గేంజర్ అనే వ్యక్తి  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అతను నవ్వుతున్నట్లుగా ఉన్న క్లిప్ మొదట చైనాలో విడుదలైంది.

చైనాకు చెందిన డోపెల్ అచ్చం మస్క్‌లాగా ఉండడంతో త్వరగా వైరల్ అయ్యాడు. ఈ అనామక వ్యక్తికి, టెక్ బిలియనీర్‌కు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సారూప్యత కారణంగా ప్రజలు అతనికి ‘యి లాంగ్ మస్క్’ అని నామకరణం చేశారు.

డోపెల్‌ గేంజర్ ఫోటోలు, వీడియో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత, మస్క్  చైనీస్ వ్యక్తితో ఉన్న విచిత్రమైన పోలికపై వ్యాఖ్యానించాలని నిర్ణయించుకున్నాడు. మస్క్ పక్కన ఉన్న డోపెల్‌ గేంజర్ చిత్రాన్ని ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు.”నేను పాక్షికంగా చైనీస్‌ని కావచ్చు” అని రాశాడు.

Read Also..  Viral Video: పాము చేసిన క్రిస్మస్ వేడుక చూడండి.. భళా! అనకుండా ఉండలేరు.. వీడియో వైరల్