Viral Video: గజరాజా మజాకా.. దూరం నుంచే సింహాలను హడలెత్తించిన ఏనుగు.. ఇదిగో వీడియో

|

Oct 13, 2024 | 6:11 PM

ఆకలితో ఉన్న మూడు సింహాలు వేట కోసం వెతుకుతున్నాయి. ఇంతలో వాటికి ఓ గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ..విందు భోజనం దొరికిందనుకున్నాయి. వెంటనే దానిపై దాడికి దిగుతాయి. అయితే , అటుగా వెళ్తున్న ఓ ఏనుగు.. గేదెపై సింహాలు దాడి చేయడం చూసి సమీపానికి వెళ్తుంది. కాస్త దూరంలో నిలబడి ఒక్కసారిగా ఘీంకరించి తన ఒళ్లు వదిలించింది.

Viral Video: గజరాజా మజాకా.. దూరం నుంచే సింహాలను హడలెత్తించిన ఏనుగు.. ఇదిగో వీడియో
Lions Attacking Buffalo
Follow us on

అడవికి రాజు సింహం. దాన్ని అడుగుల శబ్ధం వినిపించినా సరే..ఏ జంతువైనా హడలిపోవాల్సిందే. ప్రాణభయంతో పరుగులు తీయాల్సిందే. సింహానికి ఓ జంతువు ఎదురొచ్చినా, సింహం మరో జంతువుకు ఎదురు పడినా లైఫ్ రిస్క్ ఎదుటి జీవికే తప్ప సింహానికి కాదు. అందుకే.. అడవి రాజు సింహం అంటారు. అయితే, ఇంతటి సింహాన్ని సైతం భయంతో పరుగులు పెట్టించింది గజరాజు..ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో వీడియోపై స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న మూడు సింహాలు వేట కోసం వెతుకుతున్నాయి. ఇంతలో వాటికి ఓ గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ..విందు భోజనం దొరికిందనుకున్నాయి. వెంటనే దానిపై దాడికి దిగుతాయి. అయితే , అటుగా వెళ్తున్న ఓ ఏనుగు.. గేదెపై సింహాలు దాడి చేయడం చూసి సమీపానికి వెళ్తుంది. కాస్త దూరంలో నిలబడి ఒక్కసారిగా ఘీంకరించి తన ఒళ్లు వదిలించింది. దీంతో సింహాలన్నీ భయంతో అక్కడి నుంచి పరుగులు తీయటం మొదలుపెట్టాయి. ఇలా గేదెను సింహాల బారి నుంచి కాపాడింది ఆ గజరాజు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న పర్యాటకులు కొందరు తమ కెమెరాల్లో బంధించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ wildtrails.in అనే ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 41 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు తెలియజేశారు. సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు.. అంటూ కొందరు..గజరాజుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. మరీ ఏనుగు తలచుకుంటే సింహానికి కూడా చెమటలు పట్టాల్సిందే అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..