Viral video: క్లిన్ ఇండియా, గ్రీన్ ఇండియా అంటూ చాలా ఛాలెంజ్ లు ఇటీవల ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.. ఆమధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ భారత్ ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ చెత్తను అక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అయితే ఇక మనుషులే కాదు జంతువులు కూడా గ్రీన్ ఇండియా పథకాన్ని ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే రకరకాల జంతువులు గ్రీన్ ఇండియా పథకాన్ని ఫాలో అవ్వడం మనం చూశాం.. ఈ వీడియో కూడా అలాంటిదే. అయితే ఈ వీడియో ఒక ఏనుగుకి సంబంధించింది. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతుంది. అంతలా ఈ వీడియోలో ఏముందంటే..
ఈవీడియోలో ఒక ఏనుగు ఇంటిబయట పడేసిన చెత్తను తన తొండంతో తీసి డస్ట్ బిన్‌లో పడేసింది. చాలా జాగ్రత్తగా చెత్తను తీసి పద్దతిగా చెత్త బుట్టలో వేసింది. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏనుగుని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలని అంటున్నారు. కొంతమంది ఏనుగు ఇలా స్వచ్ భారత్ లో పాల్గొంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈవీడియో పై మీరూ ఓ లుక్కేయండి..
This elephant should be mascot of Swatch Bharat. A forward. pic.twitter.com/1oOeoe1MA9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 28, 2020
మరిన్ని ఇక్కడ చదవండి :