కేరళలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సఫారీ ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఏనుగు మావటిని తొక్కుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.. క్రూర జంతువు కనికరం లేకుండా తన కాళ్ళ క్రింద మావటిని తొక్కేయటం చూసి అందరూ షాక్ అవుతున్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 20న సాయంత్రం 6:30 గంటల సమయంలో అడిమాలి సమీపంలోని కల్లార్‌లో ప్రైవేట్ సఫారీ సెంటర్‌లో ఒక ఏనుగు ఆగ్రహం చెందింది. ఇడుక్కిలోని అక్రమ ఏనుగుల సఫారీ కేంద్రంపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
మావటి మరణంతో స్టాప్ మెమో జారీ చేసింది. నీలేశ్వరంకు చెందిన 62 ఏళ్ల బాలకృష్ణన్ అనే వ్యక్తి సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అడిమాలి సమీపంలోని కల్లార్‌లోని ప్రైవేట్ సఫారీ సెంటర్ అయిన కేరళ ఫామ్‌లో ఏనుగు దాడిలో మరణించాడు. పర్యాటకుల సఫారీ కోసం సిద్ధం చేస్తున్న ఏనుగు అతన్ని ముందు కాళ్లతో తొక్కి చంపింది. ఆ తర్వాత తొండంతో అతడ్ని విసిరేసింది. ఇది చూసి అక్కడున్న సిబ్బంది షాక్ అయ్యారు. ఆ ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు సఫారీ కేంద్రానికి చేరుకున్నారు.
INDIA – 🇮🇳 6/20/24 – A mahout (elephant trainer) named Balakrishnan, 62, was trying to get the elephant to move into position for a tourist to ride when the elephant turned against him. I’m sure all that poking and prodding doesn’t feel so good. More info in comments.” pic.twitter.com/xXrncV7D3o
— The Many Faces of Death (@ManyFaces_Death) June 21, 2024
ఆ కేంద్రంలోని ఏనుగులు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కాలేదని గుర్తించారు. ప్రైవేట్ సఫారీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని కేసు నమోదు చేశారు. మావటిని ఏనుగు చంపిన నేపథ్యంలో ఏనుగు సఫారీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సఫారీ కేంద్రంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..